Mahesh Babu: ద‌ర్శ‌క ధీరుడి డైరెక్ష‌న్‌లో ప్రిన్స్... పాన్ ఇండియా సినిమానా?

Updated on May 11, 2022 11:14 PM IST
 Mahesh Babu: స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ప్రిన్స్ మ‌హేష్ బాబు కొత్త సినిమా తీస్తున్నార‌ట‌. వీరిద్ద‌రి కాంబోలో పాన్ ఇండియా సినిమా వ‌స్తుంద‌ని టాక్. హీరో మ‌హేష్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి క‌లిసి సినిమా చేస్తే వ‌ర‌ల్డ్ రికార్డులు బ‌ద్ద‌లే అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్నో సినిమా రికార్డుల‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (Mahesh Babu) బ్రేక్ చేశారు. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాపై ఆస‌క్తి  పెరిగింది. మ‌హేష్ బాబుతో సినిమా చేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబోలో సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. 

ప్ర‌స్తుతం రాజ‌మౌళి హాలీడే టూర్ కోసం యూర‌ప్ వెళ్ల‌నున్నారు. మ‌హేష్ కూడా స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ త‌ర్వాత యూర‌ప్ వెలితే వెళ్లొచ్చు. ప్ర‌తీ సినిమా రిలీజ్ త‌ర్వాత తాను టూర్ వెళ‌తాన‌ని.. అదీ యూర‌ప్ ఎక్కువ‌గా వెళ‌తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. యూర‌ప్‌లో రాజ‌మౌళి, మ‌హేష్ క‌లిసి కొత్త ప్రాజెక్టుపై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నార‌ని టాక్. 

2023లో మ‌హేష్ బాబు (Mahesh Babu) రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చే సినిమా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దసరా త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మల్టిస్టారర్ సినిమా కాద‌ట‌. ఆర్.ఆర్.ఆర్ క‌న్నా బ‌డ్జెట్ చాలా ఎక్కువ ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ మ‌హేష్ కొత్త ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.  త్రివిక్రమ్ ఫిల్మ్ పూర్త‌య్యాక రాజ‌మౌళి సినిమా చేస్తాన‌ని మ‌హేష్ క్లారిటీ ఇచ్చార‌ట‌. మే నుంచి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా స్టాట్ అవుతుంది. 
 
ఆఫ్రిక‌న్ అడ‌వుల్లో సినిమా షూటింగ్ తీయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. యాక్ష‌న్, థ్రిల్ ఉండే సినిమాగా తెర‌కెక్క‌నుంది. ఇండియ‌న్ సినిమాలో ఇంత‌కు ముందు ఎప్పుడూ రాని క‌థ‌తో మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమా తీస్తున్నారు. బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్. సినిమాల‌తో రాజ‌మౌళి ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాశారు. ఇక మ‌హేష్ బాబు కూడా ఇండియ‌న్ సినిమాలో సూప‌ర్ స్టార్. కొత్త క‌థ‌తో రాజ‌మౌళి చేసే ప్ర‌యోగం మ‌హేష్ బాబుకు హై ఓల్టేజ్ హిట్ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!