Mahesh Babu: ది పీకాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీపై మ‌హేష్ బాబు

Updated on May 12, 2022 08:45 AM IST
Mahesh Babu:  ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై మ‌హేష్ బాబు ఫోటోను ప్ర‌చురించింది.
Mahesh Babu:  ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై మ‌హేష్ బాబు ఫోటోను ప్ర‌చురించింది.

Mahesh Babu:  ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై మ‌హేష్ బాబు ఫోటోను ప్ర‌చురించింది. త‌న ఫోటో ఉన్న మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌ను మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మ్యాగ‌జైన్ వాళ్ల‌కు మ‌హేష్ థాంక్స్ చెప్పారు.

సినిమా సెల‌బ్రేటీల ఫోటోల‌ను, వార్త‌ల‌ను ది పికాక్ మ్యాగ‌జైన్ త‌న‌దైన స్టైల్లో రీడ‌ర్స్‌కు అందిస్తుంది. అంత‌కు ముందు స‌మంత ఫోటోల‌ను క‌వ‌ర్ పేజ్‌పై ప్ర‌చురించిన ఈ మ్యాగ‌జైన్.. ఈ సారి మ‌హేష్ బాబు ఫోటోలను ప్రింట్ చేసింది. 

Mahesh Babu

ది పికాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీని మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ మ్యాగజైన్‌ కోసం జరిగిన ఫొటోషూట్‌ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందన్నారు. షూట్‌ కోసం కష్టపడ్డ ద పీకాక్‌ మ్యాగజైన్‌ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు మహేశ్‌ స్పెషల్‌గా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. 

మ‌హేష్ బాబు(Mahesh Babu)  స‌ర్కారు వారి పాట సినిమాతో పాటు ది పికాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ కూడా ప్యాన్స్‌ను మెప్పిస్తుంది. మ్యాగ‌జైన్ ఫోటోలో మ‌హేష్ ఇంకా అందంగా క‌నిపిస్తున్నారంటూ మ‌హేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!