Prince Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ప్రిన్స్’ మూవీ!.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) కథానాయకుడిగా నటించిన ‘ప్రిన్స్’ (Prince Movie) సినిమా దీపావళి పండుగకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ ‘ప్రిన్స్’కు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలుస్తుందని అందరూ ఆశించారు. ‘జాతిరత్నాలు’ మాదిరే ఈ చిత్రంలోనూ కామెడీ వర్కవుట్ అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
‘ప్రిన్స్’ చిత్రం త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. నవంబర్ 25 నుంచి ఈ సినిమాను హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. థియేటర్లలో మోస్తరు ఫలితాన్ని రాబట్టిన ‘ప్రిన్స్’ మూవీ.. ఓటీటీలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
‘ప్రిన్స్’ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్‌కు చెందిన నటి మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
ఇక, ప్రిన్స్ మూవీ కథ విషయానికొస్తే.. ఇద్దరు యువతీయువకుల మధ్య ప్రేమ కాస్తా రెండు దేశాల మధ్య యుద్ధంలా ఎలా మారిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా స్టోరీని రాసుకున్నారు అనుదీప్ కేవీ. ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఆయన ఈ సినిమాను తీశారని మనకు తోస్తుంది. అందుకోసమే కంటెంట్ రాసుకున్నట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ కామెడీ కాస్త అతిగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ క్రమంలో కథలో ఉండాల్సిన సీరియస్‌నెస్ తగ్గినట్లు కూడా ప్రేక్షకుడికి అనిపించక మానదు. ‘జాతిరత్నాలు’ మ్యాజిక్‌నే ఈ సినిమాలోనూ రిపీట్ చేయాలని అనుదీప్ భావించాడు. అయితే అది కొన్ని చోట్ల వర్కవుట్ కాలేదన్నది వాస్తవం. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా మరీ డల్ ఫీలింగ్‌నైతే కలిగించదు.