నేడే 'ప్రిన్స్' (Prince Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)!

Updated on Oct 18, 2022 04:07 PM IST
'ప్రిన్స్' (Prince Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
'ప్రిన్స్' (Prince Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Sivakarthikeyan: శివ కార్తికేయన్.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ నటుడు. ‘డాక్టర్’, ‘డాన్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి.

ఈ క్రమంలోనే ఈసారి 'ప్రిన్స్' (Prince Movie) సినిమాతో రాబోతున్నాడు. శివ కార్తికేయన్ నేరుగా తెలుగులో నటిస్తున్న సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శాంతి టాకీస్ బ్యాన‌ర్‌లు భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించాయి. 'జాతిరత్నాలు' వంటి ఎంటర్టైనింగ్ మూవీ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీ డైరెక్టర్ అనుదీప్ (Director Anudeep KV) ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, అలానే ఈ నెల 21న రిలీజ్ కానున్న ప్రిన్స్ మూవీ తప్పకుండా మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

'ప్రిన్స్' (Prince Movie) సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా తమిళంలో గ్రాండ్‌గా జరిగింది. దీంతో తెలుగులోనూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 18 సాయంత్రం 6గంటల నుండి హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే స్పెషల్ గెస్టులుగా రానా దగ్గుబాటి (Hero Rana), డైరెక్టర్ హరీష్ శంకర్ రానున్నారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read More: రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మహేష్ బాబు (Mahesh Babu)-రాజమౌళి ప్రాజెక్ట్.. విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!