'సర్దార్' (Sardar) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'కన్నుల్లో నీ రూపమే..' అంటూ పాడి అలరించిన హీరో కార్తీ (Karthi)..!

Published on Oct 20, 2022 06:05 PM IST

తమిళ స్టార్ హీరో కార్తి (Hero Karthi), దర్శకుడు ‘అభిమన్యుడు’ ఫేమ్ పిఎస్ మిత్రన్ కాంబోలో రూపొందిన చిత్రం ‘సర్దార్’ (Sardar). అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యాడు. 

ఈ సందర్భంగా ఆయన స్టేజి పైనే పాట పాడాడు. నాగార్జున (Akkineni Nagarjuna), టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని 'కన్నుల్లో నీ రూపమే..' అనే పాటను సూపర్ గా పాడి  అలరించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఈ పాటలు పాడుతూ అమ్మాయిలకు తెగ ట్రై చేశాను. కానీ వర్కౌట్ కాలేదు అన్నాడు.

దీనికి.. అందుకే తెలుగు ఇంత బాగా నేర్చుకున్నారు అని యాంకర్ మంజూష కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరికి నమస్కారం చెప్పిన కార్తి (Hero karthi).. 'యుగానికి ఒక్కడు' మూవీలోని డైలాగ్ బాగా ఫేమస్ అయిందట.. ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమిస్తున్నారే ఎవర్రా మీరంతా.. థ్యాంక్యూ లవ్యూ అని చెప్పాడు.

Read More: "స‌ర్దార్‌ను (Sardar Trailer) ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు".. ట్రైలర్ లో గెటప్పులతో అదరగొట్టిన కార్తీ(Karthi)!