ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘సార్‌‌’ సినిమా ఫస్ట్‌ లుక్ రిలీజ్..టీచర్‌‌గా క్లాస్‌ లుక్‌లో మాస్ హీరో

Updated on Jul 27, 2022 02:11 PM IST
తెలుగులో ధనుష్‌ (Dhanush) నేరుగా చేస్తున్న సార్‌‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్
తెలుగులో ధనుష్‌ (Dhanush) నేరుగా చేస్తున్న సార్‌‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న మొదటి సినిమా చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకి ‘వాత్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్‌పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సార్‌‌ సినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. మరో రెండు నెలల్లో సినిమా విడుదలకు రెడీ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

‘సార్’ సినిమా నుంచి వరుసగా రెండు అప్డేట్స్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్‌ వెల్లడించారు. అందులో భాగంగా ఈ రోజు సార్ సినిమాలో ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు. ఒక టేబుల్ ల్యాంప్ దగ్గర కూర్చొని ధనుష్ సీరియస్‌గా రాసుకుంటున్న లుక్ ఆకట్టుకుంటోంది.  ధనుష్‌ పాత్రపై ఆసక్తిని పెంచేలా ఉన్న లుక్‌తో సినిమాపై అభిమానులకు ఆసక్తి కలుగుతోంది.

తెలుగులో ధనుష్‌ (Dhanush) నేరుగా చేస్తున్న సార్‌‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్

రేపు టీజర్..

అలాగే ‘సార్’ సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈమధ్య కాలంలో సరైన హిట్స్ లేని ధనుష్, ‘తొలిప్రేమ’ తర్వాత మరో సక్సెస్ అందుకోని వెంకీ అట్లూరి కూడా సార్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. క్లాస్ లవ్ స్టోరీ ఉంటూనే ధనుష్ ట్రేడ్ మార్క్ మాస్ అంశాలకి కూడా ఈ సినిమాలో లోటు ఉండదని నిర్మాతలు చెబుతున్నారు.  

టీచర్‌‌గా తన స్కూల్‌ను, ప్రేమికుడిగా తన ప్రేమను సక్సెస్ చేసుకొనే ప్రాసెస్‌లో ఒక యువకుడు ఎదుర్కొన్న సమస్యలతో ఈ సినిమా రూపొందుతోంది. ‘రఘువరన్ బీటెక్‌’ సినిమాలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌గా అలరించిన ధనుష్ (Dhanush).. ఈ సినిమాలో టీచర్‌గా కనిపించనున్నారు.

Read More : ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘సార్’ సినిమా నుంచి రెండు అప్‌డేట్స్‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!