మాస్ లుక్ లో హీరో అజిత్ (Hero Ajith).. ఆయన నటించిన తాజా చిత్రం 'తునివు' (Thunivu) నుంచి సెకండ్ లుక్ రిలీజ్!

Updated on Sep 22, 2022 08:37 PM IST
మేకర్స్ ఇప్పటినుండే అజిత్‌ (Hero Ajith) పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు.
మేకర్స్ ఇప్పటినుండే అజిత్‌ (Hero Ajith) పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఫలితం ఎలా ఉన్నా ఈయన వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్‌.వినోద్‌ (H.Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఒకటి. 

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్త బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం 'తునివు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది.

తాజాగా 'తునివు' (Thunivu) సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్‌ను విడుదల చేసారు. హై హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అజిత్ అభిమానులు చాలా ఆశలే ఉన్నారు. బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్‌కరణ్ నిర్మిస్తున్నారు.

కాగా మేకర్స్ ఇప్పటినుండే అజిత్‌ (Hero Ajith) పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా విడుదలై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సెకండ్‌లుక్‌లో నెరిసిన జుట్టు, గడ్డంతో.. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మాస్‌లుక్‌లో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చాడు. ఈ చిత్రం అవుట్‌ అండ్ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ ఫిలింగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 

యాక్షన్‌ అడ్వంచర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'తునివు' (Thunivu) చిత్రంలో సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక, ఈ చిత్రంతో పాటు ఇంకా మూడు సినిమాలు అజిత్ చేతిలో ఉన్నాయి.

Read More: కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith) హీరోగా 'తునీవు' (Thunivu) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!