తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన అజయ్‌.. పుణెలో త్వరలో షూటింగ్‌

Updated on Jul 27, 2022 05:52 PM IST
పుణెలో జరిగే తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) 61వ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న అజయ్
పుణెలో జరిగే తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) 61వ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న అజయ్

తెలంగాణలో పుట్టి పెరిగినా తమిళంలో సూపర్‌‌స్టార్‌‌గా ఎదిగారు అజిత్ (Ajith). ఆయన నటించిన సినిమాలకు తమిళంలో చాలా క్రేజ్ ఉంది. చాలాకాలంగా తమిళంలో స్టార్ హీరోగా ఉన్న అజిత్‌, తన కెరీర్ తొలినాళ్ళలో తెలుగు సినిమాలే చేశారు. అయితే ఇక్కడ అనుకున్నంత క్రేజ్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లారు. అక్కడ అజిత్‌ చేసిన సినిమాలు సూపర్‌‌హిట్‌ అయ్యాయి. ఇప్పటివరకు 60 సినిమాల్లో హీరోగా నటించిన అజిత్‌.. తాజాగా తన 61వ సినిమాకి సైన్ చేశారు.

ఇక, టాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో అజయ్‌ ఒకరు. చాలాకాలం నుంచి విలన్‌గా చేస్తూనే, అప్పుడప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న క్యారెక్టర్లలోనూ నటించారాయన. హీరోగా కూడా పలు చిత్రాలు చేశారాయన. 

పుణెలో జరిగే తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) 61వ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న అజయ్

ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటున్న అజయ్

తమిళ సూపర్‌‌స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న 61వ సినిమా షూటింగ్ పుణెలో జరుగుతోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బోనీకపూర్ నిర్మిస్తున్నారు. మంజూ వారియర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక,  ఈ సినిమాలో మరో కీలకపాత్ర కోసం అజయ్‌ను సెలక్ట్‌ చేశారట మేకర్స్. పుణెలో జరుగుతున్న షూటింగ్‌ షెడ్యూల్‌లోనే అజయ్‌ చిత్ర యూనిట్‌తో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. అజిత్‌ సినిమాలో నటిస్తుండడం పట్ల చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారట అజయ్.

అజిత్‌ (Ajith) ఇటీవలే 'వలిమై ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక, స్టూడెంట్ నంబర్‌‌ 1, అతడు, ఛత్రపతి, విక్రమార్కుడు, సై, ఒక్కడు, పోకిరి, దేశముదురు, ఢీ, దూకుడు, గబ్బర్‌‌సింగ్ వంటి సూపర్‌‌హిట్‌ సినిమాల్లో అజయ్‌ విభిన్న పాత్రలలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. పుష్ప 2 సినిమాలో కూడా అజయ్ నటిస్తున్నారు.

Read More : ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘సార్‌‌’ సినిమా ఫస్ట్‌ లుక్ రిలీజ్..టీచర్‌‌గా క్లాస్‌ లుక్‌లో మాస్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!