Hero Ajith: సినిమాల్లోనే కాదు షూటింగ్ లోనూ సత్తా చాటుతున్న తమిళ్ తలైవా అజిత్ కుమార్.. 6 బంగారు పతకాలు కైవసం!

Updated on Jul 31, 2022 02:19 PM IST
అజిత్ (Ajith) ఓ పక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే మరో పక్క పతకాల వేట మొదలుపెట్టారు. పిస్టల్ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నారు.
అజిత్ (Ajith) ఓ పక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే మరో పక్క పతకాల వేట మొదలుపెట్టారు. పిస్టల్ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నారు.

త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith) తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్ లో డబ్ అయిన ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్ల‌ర్’ (Gambler Movie) వంటి సినిమాల‌తో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. తన సినిమాల్లో తెలుగు స్టార్స్‌కు కీ రోల్స్‌ ఉండేలా చూసుకుంటున్నారు అజిత్. ఇటీవలే 'వలిమై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ఆ మూవీలో మెయిన్ విలన్‌గా తెలుగు యంగ్ హీరో కార్తికేయకు ఛాన్స్ ఇచ్చారు.   

అజిత్ (Ajith) ఓ పక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే మరో పక్క పతకాల వేట మొదలుపెట్టారు. పిస్టల్ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తిరుచ్చిలో జరుగుతున్న రాష్ట్ర స్టాయి షూటింగ్ ఛాంపియన్ షిష్ లో ఆయన పాల్గొన్నారు. కాగా ఈ పోటీల్లో అజిత్ టీం నాలుగు బంగారు, రెండు కాంస్య ప‌త‌కాల‌ను గెలుచుకుంది. 

ఇందులో సీఎఫ్ పీ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్, 50 మీటర్ల ఎఫ్ పీ మాస్టర్ విభాగాల్లో అజిత్ అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో మరో రెండు కాంస్యాలు కూడా అజిత్ (Hero Ajith) వశమయ్యాయి. అజిత్ గ‌తేడాది కూడా చెన్నైలో జ‌రిగిన షూటింగ్ ఛాంపియ‌న్ షిప్‌లో 6 బంగారు ప‌త‌కాల‌ను గెలుచుకోవడం విశేషం.

ఇక, అజిత్ సినిమాల విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో మూడవ సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో తెర‌కెక్కిన 'నీర్‌కొండ పార్‌వై', 'వ‌లీమై' (Valimai) సూప‌ర్ హిట్ విజ‌యాలుగా నిలిచాయి. ఈ క్ర‌మంలో వీరి కాంబోలో హ్య‌ట్రిక్ తెర‌కెక్క‌నుంద‌డ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమా త‌ర్వాత అజిత్, విఘ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుప‌కుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివ‌ర్లో షూటింగ్ ప్రారంభించ‌నుంది.

Read More: అజిత్ (Ajith) బర్త్ డే స్పెషల్ : సినీ నటన నుండి ఫార్ములా వన్ రేస్ వరకు.. ఓ యోధుడి ప్రయాణం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!