Vikrant Rona (విక్రాంత్ రోణ) : "రారా రాకమ్మ" అంటూ దుమ్ము రేపిన సుదీప్, జాక్వెలిన్

Updated on May 25, 2022 05:24 PM IST
కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్న ఈ సినిమాపై కిచా సుదీప్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పాట "రారా రాకమ్మ" అనే గీతాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు నిర్మాతలు. 

కిచా సుదీప్ (Kicha Sudeep)  హీరోగా, కన్నడ దర్శకుడు అనూప్ భండారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ అడ్వంచర్ ఫిల్మ్ "విక్రాంత్ రోణ". నీతా అశోక్ కథానాయికగా ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతుండగా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ ప్రత్యేక గీతంలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. 

కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్న ఈ సినిమాపై కిచా సుదీప్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పాట "రారా రాకమ్మ" అనే గీతాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు నిర్మాతలు. 

అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళం, హిందీ, మలయాళం లాంటి భారతీయ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండరిన్, ఇంగ్లీష్ లాంటి విదేశీ భాషలలో కూడా విడుదల చేస్తున్నారు. 

ఈ సంవత్సరం జులై 28 వ తేదిన ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు రూ. 95 కోట్ల భారీ వ్యయంతో Vikrant Rona చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీప్ కన్నడ సినీ ప్రేమికులతో పాటు, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో సుదీప్ తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు. 

ఇటీవలే హిందీ నటుడు అజయ్ దేవగన్‌కి, సుదీప్‌కి "హిందీ జాతీయ భాష అవునా కాదా?" అనే అంశంపై ట్వీట్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!