కేజీఎఫ్ 2 (KGF 2) : టాలీవుడ్‌లో 100 కోట్లు వసూళ్లు చేసిన "రాకీ భాయ్"

Updated on May 11, 2022 11:47 PM IST
6 రోజుల్లో రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు
6 రోజుల్లో రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు

భారీ అంచనాల మధ్య రిలీజైన కేజీఎఫ్‌ పార్ట్‌–2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని భాషలతోపాటు తెలుగులోనూ యశ్ రికార్డులు తిరగరాస్తున్నాడు. కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం, దాదాపు రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు 26.4 కోట్లు, రెండో రోజు 17 కోట్లు, మూడో రోజు 13.5 కోట్లు, నాలుగో రోజు 14 కోట్లు, అయిదో రోజు 6.9 కోట్లు, ఆరో రోజు 4.7 కోట్లు నెట్‌ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

ఈ కలెక్షన్లన్నీ తెలుగులోనివి మాత్రమే కావడం విశేషం. యశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన కేజీఎఫ్‌–2 కి రవి బాస్రుర్‌‌ సంగీతాన్ని అందించారు.  

Advertisement
Credits: Google

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!