మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో కీలకపాత్రలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్?

Updated on Jun 03, 2022 05:22 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), రవిచంద్రన్
మహేష్‌బాబు (MaheshBabu), రవిచంద్రన్

‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). దానితోపాటు నిర్మాతగా ఉన్న మేజర్ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొంటూ.. బిజీబిజీగా గడుపుతున్నాడు సూపర్‌‌స్టార్. ఇక, సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్యాస్టింగ్ ఎంపికతోపాటు స్టోరీ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకున్నా.. కన్నడ నాట మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో వి.రవిచంద్రన్. కన్నడ సినిమా మార్కెట్‌ను పెంచిన వారిలో రవిచంద్రన్‌ కూడా ఒకరనే చెప్పుకోవాలి. ప్రేమలోక పేరుతో రవిచంద్రన్ చేసిన సినిమా రికార్డులు సృష్టించింది. దాని గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటారు. ఈ సినిమా తెలుగులో ప్రేమలోకం పేరుతో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా.

మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్

నాగ్, రజినీతో కలిసి..

ఇక, 1991వ సంవత్సరంలో నాగార్జున, రజినీకాంత్‌తో కలిసి రవిచంద్రన్‌ ‘శాంతి క్రాంతి’ అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. మొత్తం నాలుగు భాషల్లో తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ దానికి అయిన ఖర్చు గురించి నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత రామాచారి లాంటి బ్లాక్ బస్టర్లతో రవిచంద్రన్ మరోసారి ఫామ్‌లోకి వచ్చారు.

మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కీలక పాత్ర కోసం రవిచంద్రన్‌ను త్రివిక్రమ్ సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ బొమన్ ఇరానీ, జయరామ్‌ వంటి మంచి నటులను తన సినిమాల్లో యాక్ట్ చేయించి మంచి ఫలితాలనే రాబట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకు నేరుగా తెలుగు సినిమా చేయని రవిచంద్రన్‌ను మహేష్‌ సినిమాలో యాక్ట్ చేయిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్.

చిరంజీవితోనూ అనుబంధం..

నటీనటుల విషయంలో త్రివిక్రమ్ తీసుకుంటున్న జాగ్రత్తలు, స్క్రిప్ట్ ఫైనల్ చేయడంలో జాప్యం.. కేవలం సినిమా బాగా రావడానికేనని సమాచారం. ఇక, రవిచంద్రన్‌కు మెగాస్టార్‌‌ చిరంజీవితో కూడా మంచి అనుబంధం ఉంది. 1997లో సిపాయి సినిమాలో తన స్నేహితుడి పాత్ర కోసం రెమ్యునరేషన్ ఎంతని కూడా అడగకుండా చిరంజీవి నటించిన విషయాన్ని రవిచంద్రన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, టాలీవుడ్‌ నుంచి వచ్చిన అవకాశాలను రవిచంద్రన్‌ పక్కనపెడుతున్నారు. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమా గురించి ఎటువంటి డెసిషన్‌ తీసుకున్నారో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వేచి చూడక తప్పదు మరి.

Read More: సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చే మూడో సినిమా ‘అర్జునుడు’?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!