Raghava Lawrence : రాఘవ లారెన్స్ మనల్ని భయపెట్టడానికి మళ్లీ వచ్చేస్తున్నాడు. అప్పుడు కాంచన .. ఇప్పుడు దుర్గ !
ముని, కాంచన సినిమాలతో హారర్ చిత్రాలలో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఇప్పుడు 'దుర్గ' (Durga) అనే ఓ వైవిధ్యమైన చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ యాక్షన్ చిత్రానికి స్టంట్ మాస్టర్స్ అన్బరీవ్ (Anbariv) దర్శకత్వం వహించాల్సి ఉండగా, వారు ఈ ప్రాజెక్టు నుండి వేగంగానే వైదొలిగారు. ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా, వారు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా రాఘవ లారెన్స్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.
జనవరి 2022లో, రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన తదుపరి చిత్రం 'దుర్గ'కు స్టంట్ మాస్టర్స్ అన్బుమణి, అరువిమణిలను దర్శకులుగా ప్రకటించారు. వీరిని అభిమానులు అన్బరివ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే తొలిసారిగా మెగాఫోన్ పట్టబోతున్న ఈ స్టంట్ మాస్టర్స్ ఇటీవలే ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు ప్రకటించారు. వారి నిర్ణయం వెనుక కారణాన్ని పంచుకుంటూ, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పోస్టును పంచుకున్నారు.
"మనం సినిమా పరిశ్రమ గురించి కలలు కనడానికి ముఖ్య కారణం, దర్శకత్వం పట్ల గల మక్కువ. అదే మక్కువ మమ్మల్ని చివరికి స్టంట్ కొరియోగ్రాఫర్‌లను చేసింది. అయినా దర్శకత్వం చేయాలని ఉండేది. ఈ మధ్య, శ్రీ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మాస్టర్ గారు చాలా దయతో తన నిర్మాణంలో ఆయన నటించిన చిత్రానికి దర్శకత్వం వహించమని కోరారు. మాపై ఆయన ఉంచిన నమ్మకానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము.
కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నాము. మా మునుపటి స్టంట్ కొరియోగ్రఫీ కమిట్‌మెంట్‌లే అందుకు కారణం. ఆ చిత్రాల షెడ్యూల్‌ల కారణంగా, మేము ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటున్నాము. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ప్రియమైన రాఘవ లారెన్స్ మాస్టర్‌కి ధన్యవాదాలు. అలాగే ఆ చిత్రానికి మా శుభాకాంక్షలు" అని తెలిపారు.
ఇండస్ట్రీకి సూపర్ డూపర్ సక్సెస్‌ను అందించిన కాంచన ఫ్రాంచైజీతో చాలా పాపులరైన నటుడు, కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). 'దుర్గ' చిత్రం కూడా హారర్ కామెడీ సినిమానే. రాఘవ లారెన్స్ స్వంత నిర్మాణ సంస్థ శ్రీ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.