Acharya Updates - ఆచార్య ట్రైలర్‌‌లో కనిపించని ‘కాజల్’

Updated on Apr 19, 2022 04:37 PM IST
తాజాగా రిలీజైన ఆచార్య ట్రైలర్‌‌లో కాజల్‌ అగర్వాల్‌ ఒక్కచోట కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.
తాజాగా రిలీజైన ఆచార్య ట్రైలర్‌‌లో కాజల్‌ అగర్వాల్‌ ఒక్కచోట కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ప్రతి హీరోయిన్‌ కలలు కంటుంది, ఇప్పటికే చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్‌‌ 150లో ఆ అవకాశం దక్కించుకున్న కాజల్ అగర్వాల్.. ఆచార్యలో మరోసారి ఆ చాన్స్ కొట్టేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ అదృష్టవంతురాలని చాలామంది అనుకున్నారు కూడా. అయితే తాజాగా రిలీజైన ఆచార్య ట్రైలర్‌‌లో కాజల్‌ అగర్వాల్‌ ఒక్కచోట కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. అసలు ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా చేసిందా లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రామ్‌చరణ్‌ సరసన చేసిన పూజాహెగ్డే కూడా ట్రైలర్‌‌లో రెండు చోట్ల మెరిసింది. దీంతో కాజల్‌ కనిపించకపోవడంపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

కరోనా ఎఫెక్ట్‌.. తర్వాత ప్రెగ్నెన్సీ..

కరోనా వ్యాప్తి పెరగడంతో ఆచార్య షూటింగ్ వాయిదా పడింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాజల్‌ ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ కావడంతో షూటింగ్‌లో పాల్గొనలేదు. కరోనా ప్రారంభానికి ముందే చాలా వరకు షూటింగ్‌ కంప్లీట్‌ అయినా..మిగిలిన సినిమాను పూర్తి చేయాలని నిర్మాతలు ఆమెను కోరినా కాజల్‌ నో చెప్పిందని సినీ వర్గాల సమాచారం. దీంతో చిత్ర యూనిట్‌ ముఖ్యంగా నిర్మాతలు అసహనానికి లోనయ్యారని, అందుకే ట్రైలర్‌‌లో ఆమె కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సినిమాలో కాజల్‌ నటించిన కొన్ని సన్నివేశాలను తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమోకాదో తెలియాలంటే మాత్రం ఈనెల 29 వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!