Allu Arjun : అల్లు అర్జున్ మరో రికార్డ్ బ్రేక్ చేశాడు .. ట్విట్టర్‌‌లో 7 మిలియన్ల ఫాలోవర్లు !

Updated on Aug 17, 2022 06:33 PM IST
Allu Arjun : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం ఆయనకు ఉత్తరాదిలో కూడా ఓ గొప్ప ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసేసింది.
Allu Arjun : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం ఆయనకు ఉత్తరాదిలో కూడా ఓ గొప్ప ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసేసింది.

పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సుపుత్రుడిగా సుపరిచితుడైన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). అతన్ని అభిమానులు 'బన్నీ' అని ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. 

మొదటి సినిమా 'గంగోత్రి'తోనే సూపర్ హిట్ కొట్టిన బన్నీ.. ఆ తర్వాత ఆర్య, దేశముదురు, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠాపురం, పుష్ప లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. 

తెలుగుతో పాటు మలయాళంలో కూడా అల్లు అర్జున్‌కి (Allu Arjun) మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన తెలుగులో నటించిన ప్రతీ సినిమా కూడా మలయాళంలో సైతం రిలీజై, అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలున్నాయి. 'పుష్ప' సినిమా అయితే ఉత్తరాదిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో కూడా బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. 

ఇటీవలే ట్విటర్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్ ఫాలోయింగ్ 7 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. అలాగే ఓ మోనోక్రోమ్ స్టిల్‌ని సైతం షేర్ చేశారు. ఆ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో బన్నీ చాలా స్టైలిష్‌గానూ ఉన్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నింటినీ ప్రమోట్ చేస్తున్నాడు. కోకాకోలా, కేఎఫ్సీ లాంటి బ్రాండ్లు బన్నీనే అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. అలాగే ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ 'పుష్ప 2' చిత్రాన్ని చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నాడట. 

Read More: ‘పుష్ప’ సిగ్నేచర్‌ వాక్‌ క్రెడిట్‌ ఎవరిదంటే..సీక్రెట్‌ చెప్పేసిన అల్లు అర్జున్‌ (Allu Arjun)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!