దిలీప్‌ కుమార్‌‌తో నటించలేకపోయా.. ఆయనంటే నాకెంతో ఇష్టమన్న కమల్ హాసన్ (Kamal Haasan)

Updated on Jun 04, 2022 01:50 PM IST
కమల్‌ హాసన్ (Kamal Haasan), దిలీప్ కుమార్
కమల్‌ హాసన్ (Kamal Haasan), దిలీప్ కుమార్

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించారు. గెస్ట్‌ రోల్‌లో తమిళ హీరో సూర్య కనిపించనున్నాడు. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన విక్రమ్‌ సినిమా జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

కమల్‌కు దిలీప్‌ కుమార్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో నటించాలని ఎంతో ఆశపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో కమల్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘దిలీప్‌ కుమార్‌‌తో నటించే అవకాశం కోల్పోయాను. ఇతర నటీనటులతో కలిసి నటించడం అంతే ఇష్టం. నేను నటించాలని కోరుకుని, నటించని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దిలీప్‌ కుమార్ సర్. 'తేవర్‌ మగన్‌' అనే సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరేందుకు దిలీప్‌ సర్‌‌ను కలిశాను. ఆయన చేతులు పట్టుకుని మరీ, ఆ సినిమాలో నటించాలని ప్రాధేయపడ్డా. కానీ ఆయన ఒప్పుకోలేదు' అని కమల్‌ హాసన్‌ తెలిపారు. కొన్నాళ్ల తర్వాత అదే సినిమా హిందీలో అనిల్‌ కపూర్, అమ్రిష్‌పురి కాంబినేషన్‌లో 'విరాసత్‌'గా తెరకెక్కింది. ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది.  

కాగా, విక్రమ్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న క‌మ‌ల్ హాస‌న్ త‌న స్నేహితుడు, లెజెండ‌రీ యాక్టర్ ర‌జినీకాంత్‌ను చెన్నైలోని ఆయ‌న నివాసంలో చిత్ర యూనిట్‌తో ఆదివారం క‌లిశారు. ర‌జినీకాంత్‌ను  ఎందుకు కలిశారు? అనే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ లేదు. అయితే విక్రమ్‌ సినిమా స్పెషల్‌ ప్రీమియర్‌‌కు రావాలని రజినీకాంత్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మ‌రోవైపు విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజినీకాంత్ రాబోతున్నారా? అనే దానిపై కూడా చ‌ర్చ న‌డుస్తోంది. తెలుగు, త‌మిళం, హిందీతోపాటు ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమాకి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందించాడు.

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన విక్రమ్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మే 31వ తేదీన నిర్వహించనున్నారు. శిల్పక‌ళావేదిక‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో పాటు రజినీ కాంత్‌ కూడా హాజరవుతారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇద్దరు లెజెండరీ యాక్టర్లు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే మరి. కాగా, విక్రమ్ సినిమా తెలుగు నెగెటివ్‌ రైట్స్‌ను యంగ్ హీరో నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!