ధనుష్‌తో గొడవలపై హీరోయిన్ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) క్లారిటీ.. వార్తలు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి

Updated on Jul 27, 2022 08:36 PM IST
ధనుష్‌ హీరోగా నటిస్తున్న సార్ సినిమాలో సంయుక్తా మీనన్‌ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ధనుష్‌ హీరోగా నటిస్తున్న సార్ సినిమాలో సంయుక్తా మీనన్‌ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ (Samyuktha Menon-). ఈ సినిమాలో రానాకు భార్యగా సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగు సినిమాల్లో ఆఫర్స్‌ క్యూ కట్టాయి. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సంయుక్త.

త్వరలోనే బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంయుక్త. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 5వ తేదీన బింబిసార (Bimbisara) సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంయుక్తా మీనన్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సంయుక్త పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హీరో ధనుష్‌తో గొడవలు జరిగాయని వచ్చిన పుకార్లపై సంయుక్త స్పందించారు. కాగా సంయుక్త, ధనుష్‌ హీరోహీరోయిన్లుగా ‘సార్‌’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ధనుష్‌ నేరుగా నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో తనకు, ధనుష్‌కు గొడవ జరిగిందని, దీంతో మధ్యలోనే ఆమె మూవీ సెట్‌ నుంచి వెళ్లిపోయినట్లు గతంలో ప్రచారం జరిగింది.

ధనుష్‌ హీరోగా నటిస్తున్న సార్ సినిమాలో సంయుక్తా మీనన్‌ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

క్రియేటివిటీ ఉంటేనే..

‘ధ‌నుష్‌తో నాకు గొడ‌వ‌లా! నిజంగానే అలాంటి వార్తలు వ‌చ్చాయా? నాకు తెలియ‌దు. అలాంటి వార్తలు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి’ అంటూ ధనుష్‌తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఇక, మహేష్‌బాబు – -త్రివిక్రమ్‌ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు సంయుక్త (Samyuktha Menon-).

 కాగా, ధనుష్‌ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం 21 రోజుల కాల్షీట్స్‌ కేటాయించానని, ఒక పాట మినహా తనకు సంబంధించిన సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పారు సంయుక్తా మీనన్‌. త్వరలోనే ఈ పాట షూటింగ్‌ జరగనుందని, అందులో పాల్గొననున్నట్లు వెల్లడించారు సంయుక్త (Samyuktha Menon-). సాయిధరమ్‌ తేజ్ – సముద్రఖని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

Read More : కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా నటించిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్ (Junior NTR)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!