పుస్తకాల కంటే స్క్రిప్టులే ఎక్కువగా చదువుతున్నా: రెజీనా కాసాండ్రా (Regina Cassandra)

Updated on Jun 21, 2022 06:59 PM IST
రెజీనా కసాండ్రా (Regina Cassandra)
రెజీనా కసాండ్రా (Regina Cassandra)

విభిన్నమైన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటూ తన నటనలోని వేరియేషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది హీరోయిన్ రెజీనా కాసాండ్రా (Regina Cassandra) . వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటున్న రెజీనా ఇటీవల ‘ఆన్యాస్‌ ట్యుటోరియల్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.

జూలై 1వ తేదీ నుంచి ఈ సిరీస్ ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే నివేదా థామస్‌తో కలిసి రెజీనా నటించిన 'శాకినీ డాకినీ ' సినిమా కూడా త్వరలో రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో తన గురించిన విషయాలను రెజీనా కాసాండ్రా మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు పింక్ విల్లా వ్యూయర్స్‌ కోసం..

మీరు ఏ డైరెక్టర్‌‌తో పనిచేయాలని అనుకుంటున్నారు?

నేనెప్పుడూ ఈ డైరెక్టర్‌‌తో పనిచేయాలి,  ఆ డైరెక్టర్‌‌తో వర్క్‌ చేయాలి అని అనుకోను. కథలో నా క్యారెక్టర్‌‌ను న్యాయం చేయగలనని నన్నునమ్మి వచ్చిన ఏ డైరెక్టర్‌‌తోనైనా వర్క్‌ చేయడానికి రెడీగా ఉంటాను.

ఈ హాలీవుడ్‌ సినిమాలో చాన్స్ వస్తే బాగుండేది అనుకున్న సినిమా?

మైఖేల్‌ గాండ్రీ దర్శకత్వంలో 2004వ సంవత్సరంలో వచ్చిన ‘ఎటర్నల్ సన్‌ఫైన్‌ ఆఫ్‌ ది స్పాట్‌లెస్‌ మైండ్’ అనే సినిమాలో నటించే అవకాశం వస్తే బాగుండేదని అనుకున్నాను. జిమ్‌ కేరీ, కేట్‌ విన్‌స్లెట్ తదితరులు ఆ సినిమాలో నటించారు.

ట్రావెలింగ్‌లో వెంట ఉంచుకునే మూడు వస్తువులు?

షూటింగ్స్‌, పర్సనల్ ట్రిప్స్‌, ఫ్యామిలీ టూర్స్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా లిప్‌ బామ్, ఫేస్‌ వాష్ వెంట ఉండేలా చూసుకుంటాను. ఇప్పుడు శానిటైజర్‌‌ను కూడా వాటికి జత చేశా. అది కూడా తప్పనిసరి కదా.

శాకినీ డాకినీ సినిమా పోస్టర్

ఎక్కువగా ఎటువంటి పదార్థాలు తింటుంటారు?

ఆరోగ్యకమైన ఆహార పదార్థాలు తింటాను. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతాను.

మీ ఫేవరెట్రెస్టారెంట్, ఇష్టపడే ఫుడ్ ఏది?

చెన్నైలోని దాలియా. జపనీస్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం.

మీ అందానికి రహస్యం?

ఎప్పుడూ శుభ్రంగా, అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తాను.

ఎటువంటి పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు?

నేను ఎక్కువగా పుస్తకాలు చదవను. ఇప్పుడు పుస్తకాలకంటే సినిమా స్క్రిప్టులే ఎక్కువగా చదువుతున్నాను. ఆడియోలు వినడం కంటే చదివితేనే మంచిదని అనుకుంటాను.

ఏ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు?

ఈ మధ్యనే మేఘాలయ వెళ్లొచ్చాను. నేను ఎక్కువగా వెళ్లేందుకు ఇష్టపడే  ప్రదేశాల లిస్ట్‌లో ప్రముఖ దేశాలైన దుబాయ్‌, సెర్బియా, ఫ్రాన్స్‌ ముందుంటాయి అని చెప్పింది రెజీనా కాసాండ్రా (Regina Cassandra)

Read More: చిరంజీవి గురించే ఆచార్యలో ప్రత్యేక పాటను అంగీకరించా.. ఇకపై చేయను: రెజీనా కసాండ్రా (Regina Cassandra)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!