‘అన్యాస్‌ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్‌తో భయపెడతానంటున్న రెజీనా కసాండ్రా (Regina Cassandra).. ఆహాలో జూలై 1 నుంచి

Updated on Jun 21, 2022 08:49 PM IST
అన్యా స్ ట్యుటోరియల్ వెబ్‌ సిరీస్ ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి
అన్యా స్ ట్యుటోరియల్ వెబ్‌ సిరీస్ ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి

ఓటీటీ వేదిక ‘ఆహా’ హారర్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్‌ సిరీస్‌ను అర్కా మీడియాతో కలిసి ఆహా రూపొందించింది. ఈ వెబ్‌ సిరీస్ జూలై 1వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌‌ను ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి లాంచ్ చేశారు. రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌లోకి దెయ్యం వస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఊహించని మలుపులతో హారర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ 7 ఎపిసోడ్‌లలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ వైపుగా అడుగులు వేస్తోంది. అదే డిజిటల్‌ రంగం ప్రజలను భయపెడితే? అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ‘అన్యాస్ ట్యుటోరియల్’. అన్య (నివేదితా సతీష్) సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌‌ కావాలని ప్రయత్నిస్తుంటుంది. అన్యకు అక్కగా రెజీనా కసాండ్రా (మధు) నటించింది. మధుకు అన్య ప్రొషెషన్ నచ్చదు. ఆ విషయాన్ని తనతో చెప్తుంది.

నివేదితా సతీష్, రెజీనా కసాండ్రా

అయితే, ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అనే విషయం వెబ్‌ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. కాగా, అన్యాస్‌ ట్యుటోరియల్ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌‌ ఆద్యంతం భయపెట్టేలా, సిరీస్‌పై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. రెజీనా, నివేదితా సతీష్‌ యాక్టింగ్‌ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌‌ హార్ట్‌బీట్‌ను పెంచేలా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్.     

అర్కా మీడియా అధినేత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుడిని భయపెట్టడం చాలా కష్టమైన పని. అయితే యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేశారు. ఆహాతో కలిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించడం సంతోషంగా ఉంది. అన్యాస్ ట్యుటోరియల్ కథ విన్న వెంటనే ఈ కాన్సెప్ట్‌ను అభిమానులు ఇష్టపడతారని అనుకున్నాం. అంతే కాన్ఫిడెన్స్‌తో ‘అన్యాస్ ట్యుటోరియల్స్’ వెబ్‌ సిరీస్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం’ అని చెప్పారు.

నివేదితా సతీష్ మాట్లాడుతూ.. ‘గుంటూరుకు చెందిన నేను తెలుగు ఇండస్ట్రీలోకి మళ్లీ ఎప్పుడెప్పుడు అడుగుపెడతానా అని ఎదురుచూశాను. ఆ కల ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్‌తో నెరవేరింది. చాలా కాలం తర్వాత తెలుగులో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రెజీనా కసాండ్రాతో (Regina Cassandra) కలిసి చేసిన వెబ్‌ సిరీస్‌ను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’ అని చెప్పింది.

Read More : ‘కొండా’ సినిమాలో సురేఖమ్మ క్యారెక్టర్ చేయగలనని రాంగోపాల్ వర్మ (RGV) నమ్మడం నా అదృష్టం: ఇర్రా మోర్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!