‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ కానున్న అరుళ్‌నిధి స్టాలిన్ ‘రేయికి వేయి కళ్లు’ సినిమా.. ఎప్పటి నుంచి అంటే?

Updated on Sep 27, 2022 06:05 PM IST
మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగులోకి అనువదించి ప్రేక్షకులను అలరిస్తోంది ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా (Aha)
మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగులోకి అనువదించి ప్రేక్షకులను అలరిస్తోంది ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా (Aha)

కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫాంల వినియోగం విపరీతంగా పెరిగింది. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా అయితే చాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేసి థియేటర్లలోకి విడుదల చేసేవారు ఇదివరకు. ఓటీటీలు వచ్చిన తర్వాత హిట్ అయిన సినిమాలను డబ్బింగ్‌ చేసి వెంటనే రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నాయి ఓటీటీ సంస్థలు.

ఏ భాషలో సినిమా వచ్చి హిట్‌ అయినా.. దానిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది ఓటీటీ ఆహా (Aha). ఈ క్రమంలోనే తమిళంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఇరువక్కు అయిరమ్ కంగళ’ అనే సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్ చేస్తోంది ఆహా. ఈ సినిమాకు తెలుగులో ‘రేయికి వేయి కళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. సెప్టెంబర్‌‌ 30వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. 

క్రైమ్‌, థ్రిల్లర్ జానర్‌‌లో..

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు అరుళ్‌నిధి స్టాలిన్. ప్రస్తుతం అరుళ్‌నిధి.. రేయికి వేయి కళ్లు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నారు.  క్రైమ్, థ్రిల్లర్‌‌ నేపథ్యంలో జరిగే కథకు ప్రేక్షకులు ఫిదా కావడంతో సినిమాకు హిట్‌ టాక్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు అరుళ్‌నిధి స్టాలిన్. 

మరో రెండు రోజుల్లో రేయికి వేయి కళ్లు సినిమా ఆహా (Aha)లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్‌‌ను రిలీజ్ చేసింది ఆహా. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‌ సన్నివేశాలతోపాటు ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా రేయికి వేయి కళ్లు అని అనిపిస్తోంది. ము.మారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ సీరియల్‌ మర్డర్‌‌ జానర్‌‌ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తెలుగులో రాక్షసుడు సినిమాను నిర్మించిన యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ‘రేయికి వేయి కళ్లు’ సినిమాను నిర్మించారు.

Read More : ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌ 2పై ఆహా (Aha) క్లారిటీ.. గెస్ట్‌లు ఎవరో కామెంట్‌ చేయాలని ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!