ఐఏఎస్‌ ఆఫీసరై ప్రజలకు సేవ చేయాలని అనుకున్నా..కానీ నటినై అభిమానులను అలరిస్తున్నాను: రాశీ ఖన్నా (Raashi Khanna)

Updated on Jul 02, 2022 07:18 PM IST
రాశీ ఖన్నా (Raashi Khanna)
రాశీ ఖన్నా (Raashi Khanna)

సౌత్‌ సినిమాలతోపాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రాశీ ఖన్నా (Raashi Khanna). ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన రాశీ.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు త్వరగానే దగ్గరయ్యారు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు రాశీ. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు..

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఐఏఎస్ ఆఫీసర్‌‌ కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్నాను. అయితే దేవుడు నేను యాక్టర్‌‌ కావాలని రాసిపెట్టాడని అనుకుంటాను. అందుకే నటిగా మారి అభిమానులను అలరిస్తున్నాను. సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌‌ను ఎంజాయ్‌ చేస్తూనే చేశాను.

పక్కా కమర్షియల్ షూటింగ్‌లో మారుతి, రాశీ ఖన్నా

అభిమానం దక్కడం ఆనందంగా..

రాశీ ఖన్నా (Raashi Khanna) నటిగా మారడం వలనే ఎంతో అభిమానం దక్కింది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని ప్రభావతి క్యారెక్టర్, ‘తొలిప్రేమ’ సినిమాలోని వర్ష క్యారెక్టర్ నాకెంతో నచ్చాయి. ‘వరల్డ్‌ ఫేమస్ లవర్‌‌’ సినిమాలోని యామిని పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. అయితే ఆ క్యారెక్టర్‌‌ ఎక్కువ మందికి నచ్చలేదు. మరిన్ని మంచి క్యారెక్టర్లు చేయడానికి ప్రయత్నిస్తాను. 

పచ్చబొట్టు చూసి ఆనందించా..

‘ప్రతిరోజూ పండుగే’  సినిమా కోసం రాజమండ్రిలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ అభిమాని నా వద్దకు వచ్చి తన చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. తర్వాత రోజు నేను చేసిన సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకుని వచ్చాడు. ఆ క్షణం చాలా ఆనందంగా అనిపించింది. అభిమానులు చూపించే ప్రేమకు కృతజ్ఞురాలిని. నాకు కాబోయే భర్తకు దైవ భక్తి ఉన్నవాడై, మనసున్న వాడై ఉండాలి’ అని రాశీ ఖన్నా (Raashi Khanna) చెప్పుకొచ్చారు.

Read More : మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ రిలీజ్‌ చేసిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!