75వ సినిమా కోసం 3 నెలల డేట్స్ కేటాయించిన నయనతార (Nayanthara).. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారంటే?

Updated on Jul 25, 2022 07:15 PM IST
‘లేడీ సూపర్‌‌స్టార్ 75’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న నయనతార (Nayanthara)
‘లేడీ సూపర్‌‌స్టార్ 75’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న నయనతార (Nayanthara)

తొలి సినిమా ‘చంద్రముఖి’లోనే సూపర్‌‌స్టార్ రజినీకాంత్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు నయనతార (Nayanthara). ఆ తర్వాత ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోల సరసన నటించి, లేడీ సూపర్‌‌స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్‌.. మళ్లీ సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్నారు.

ఇక, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ల గురించి ప్రస్తావన మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుంది. వాళ్లు తీసుకునే పారితోషకాలతో పోల్చి చూస్తే హీరోయిన్లు తీసుకునేది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌‌ హీరోయిన్ల రెమ్యునరేషన్‌ కూడా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రికార్డును నయనతార బ్రేక్ చేశారు. దక్షిణాదిలో రూ.పది కోట్ల పారితోషికం అందుకోబోతున్న తొలి హీరోయిన్‌గా నయనతార చరిత్ర సృష్టించారు.

‘లేడీ సూపర్‌‌స్టార్ 75’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న నయనతార (Nayanthara)

నెట్‌ఫ్లిక్స్‌ కోసం..

నయనతార (Nayanthara) నటిస్తున్న 75వ సినిమా ఇటీవలే స్టార్ట్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం జీ స్టూడియోస్‌ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమాకు నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘లేడీ సూపర్‌స్టార్‌ 75’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం దాదాపుగా 3 నెలల కాల్‌షీట్స్‌ను నయనతార కేటాయించారని టాక్.

ఓటీటీ వేదికగా దేశవ్యాప్తంగా చేరువయ్యే కథాంశంతో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం నయనతార (Nayanthara) రూ.పది కోట్ల రెమ్యునరేషన్‌ అందుకోనున్నారని తెలిసింది. దక్షిణాది కథానాయిక రూ.పది కోట్ల పారితోషికం అందుకోవడం ఇదే ఫస్ట్‌ టైమ్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Read More : భారీ మొత్తంలో డబ్బులిచ్చినందుకే అవార్డు.. హీరోయిన్ సమంత (Samantha) కామెంట్స్‌ వైరల్‌ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!