హెబ్బా పటేల్ (Hebah Patel), సునీల్ నటించిన 'గీత' సినిమా రిలీజ్ ఎప్పుడంటే? వెల్లడించిన చిత్ర యూనిట్

Updated on Aug 14, 2022 11:36 PM IST
హెబ్బా పటేల్ (Hebah Patel), సునీల్ నటించిన 'గీత' సినిమా పోస్టర్
హెబ్బా పటేల్ (Hebah Patel), సునీల్ నటించిన 'గీత' సినిమా పోస్టర్

హెబ్బా పటేల్ ( Hebah Patel), సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గీత. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. దర్శకుడు వీవీ వినాయక్  శిష్యుడు 'విశ్వ'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'గ్రాండ్ మూవీస్' పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథా చిత్రం 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అనేది సినిమా టైటిల్ ట్యాగ్‌ లైన్.  సెన్సార్‌‌తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గీత సినిమా ఈనెల 26న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన గీత సినిమాలో ప్రముఖ నటుడు సునీల్ కీలకపాత్రలో నటించారు. 'నువ్వే కావాలి, ప్రేమించు' వంటి సినిమాల్లో హీరోగా నటించిన  సాయి కిరణ్ విలన్‌ పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు విశ్వ మీడియాతో మాట్లాడారు.

హెబ్బా పటేల్ (Hebah Patel), సునీల్ నటించిన 'గీత' సినిమా పోస్టర్

వీవీ వినాయక్‌ గారి కారణంగానే గీత సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. నిర్మాత రాచయ్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు దర్శకుడు.'గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ 'గీత' సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, హెబ్బా పటేల్ ( Hebah Patel), సునీల్ సినిమాలో బాగా నటించారని నిర్మాత ఆర్.రాచయ్య అన్నారు.

Read More : లైగర్ సినిమా సక్సెస్ అవుతుందంటున్న విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. పర్సనల్ లైఫ్‌పైనా ఆసక్తికర కామెంట్లు


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!