Nithiin & Krithi Shetty: 'మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతిశెట్టి పై నితిన్ సంచలన వ్యాఖ్యలు..!

Updated on Aug 08, 2022 04:45 PM IST
ఆగస్ట్ 12న రాబోతోన్న 'మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను(Macherla Niyojakavargam PreRelease Event)ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు.
ఆగస్ట్ 12న రాబోతోన్న 'మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను(Macherla Niyojakavargam PreRelease Event)ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin), అందాల భామ కృతిశెట్టి (Krithi Shetty) జంట‌గా న‌టించిన చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం' (Macherla Niyojakavargam). ఈ సినిమా ఆగ‌స్ట్ 12న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ద్వారా నితిన్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రాబోతోన్నాడు. కాగా, మాచర్ల నియోజకవర్గం అంటూ ఇది వరకే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచేశాడు నితిన్. 

ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్‌కు చేర్చారు మేకర్స్. ఆగస్ట్ 12న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Macherla Niyojakavargam Pre Release Event) ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నితిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. కృతి చూడటానికి ఇలా అమాయకంగా ఉంటుంది.. కానీ చాలా షార్ప్. ఆమె మమ్మల్ని అడిగే ప్రశ్నలకు చూసి షాక్ అవుతుంటాం. ఇలాంటి క్వాలిటీ చాలా తక్కువ మందిలో చూశాను. ఆమెకు ఇండస్ట్రీలో ఎంత భవిష్యత్తు ఉంది అని పేర్కొన్నాడు. 

కృతి శెట్టి (Krithi Shetty)

కృతి శెట్టి (Krithi Shetty) మాట్లాడుతూ.. ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఇక ఈ మూవీలో నా పాత్ర పేరు స్వాతి. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది’ అని చెప్పుకొచ్చింది. కృతి ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నిజానికి ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి, అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని తెలిపింది. 

కృతి శెట్టి ప్ర‌స్తుతం సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా మోహన కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తోంది. అలాగే సూర్య హీరోగా బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

 

కృతి శెట్టి (Krithi Shetty)

ఇక, కృతి శెట్టి (Krithi Shetty) ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. కారణం తమిళంలో ‘కృతి శెట్టి’ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. మరోవైపు ఈ బ్యూటీకి వరుస హిట్లు వస్తుండటం.. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తుండటంతో కృతి శెట్టి రెమ్యునరేషన్ ను రెండింతలు పెంచింది. ప్రతి సినిమాకి ఇప్పుడు 2 కోట్లు అడుగుతుందట. పైగా హీరో రేంజ్ ను బట్టి డబ్బులు అడుగుతోంది.

Read More: Macherla Niyojakavargam Trailer: 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. డైలాగులతో అదరగొట్టిన నితిన్ (Nithiin)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!