పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) బర్త్‌డేకు సర్‌‌ప్రైజ్ ప్లాన్ చేసిన హరిహర వీరమల్లు టీం! టీజర్ రిలీజ్ చేసే చాన్స్

Updated on Aug 30, 2022 10:25 AM IST
పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్
పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగా వెయిట్‌ చేస్తారో తెలిసిన విషయమే. భీమ్లా నాయక్ సినిమా హిట్‌ తర్వాత పవన్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ చాలా నెమ్మదిగా జరుగుతోంది.

హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజులుగా ఏ విధమైన అప్‌డేట్స్‌ రావడం లేదు. దీంతో పవన్ అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. కరోనా కారణంగా, అనుకోని కారణాల వలన కూడా సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. 

పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్

త్వరలోనే రీస్టార్ట్..

ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను ఎప్పుడు రీస్టార్ట్‌ చేస్తారనే చర్చ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం ఇటీవల వెల్లడించారు.

ఇదిలావుండగా సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానుల కోసం హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఒక స్పెషల్‌ టీజర్‌ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read More : పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు డబుల్ థమాకా.. ‘జల్సా’తోపాటు ‘తమ్ముడు’ సినిమా కూడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!