'క్యాష్' షో లో ప్రత్యక్షమైన 'బ్రహ్మాస్త్రం' (Brahmastram) టీమ్.. రాజమౌళిని (Rajamouli) గిల్లేసిన యాంకర్ సుమ!

Updated on Sep 05, 2022 04:52 PM IST
రాజమౌళి క్యాష్ షో (Cash Show) వేదిక పైకి రాగానే.. ఒకసారి గిచ్చరా అండి అని రాజమౌళితో అనగానే ఆయన సుమ (Anchor Suma) చేతి మీద గిల్లారు.
రాజమౌళి క్యాష్ షో (Cash Show) వేదిక పైకి రాగానే.. ఒకసారి గిచ్చరా అండి అని రాజమౌళితో అనగానే ఆయన సుమ (Anchor Suma) చేతి మీద గిల్లారు.

బాలీవుడ్ స్టార్ నటీనటులు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్రం' (Brahmastram). భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక, ఈ సినిమాని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సమర్పణలో విడుదల చేస్తుండడంతో ఆయన సైతం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మామూలుగా సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి టీవీ షోస్ ని వాడుకుంటూ ఉంటారు ఆయా సినీ బృందాలు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుంతుందంటే చాలు బుల్లితెరపై జబర్దస్త్, క్యాష్ వంటి షోస్ లో సందడి చేస్తుంటారు మూవీ యూనిట్. తాజాగా 'బ్రహ్మాస్త్రం' టీమ్ కూడా క్యాష్ షోలో పాల్గొంది.  

'బ్రహ్మాస్త్రం' (Brahmastram) సినిమాలో నటించిన మౌనీ రాయ్, అలియా భట్, రణబీర్ కపూర్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన వీరందరికీ సుమ సాదరంగా స్వాగతం పలికారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఆహ్వానిస్తూ ఆయన ముందు ఫ్లాప్ అనే పదం కూడా ఫ్లాప్ అయిపోయింది ఆయనే ఎస్ఎస్ రాజమౌళి అంటూ దర్శకుడిని వేదికపైకి ఆహ్వానించారు.

రాజమౌళి క్యాష్ షో (Cash Show) వేదిక పైకి రాగానే.. ఒకసారి గిచ్చరా అండి అని రాజమౌళితో అనగానే ఆయన సుమ (Anchor Suma) చేతి మీద గిల్లారు. దీంతో ఆమె రాజమౌళి వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

అయితే ఒకప్పుడు టాలీవుడ్​ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు సినిమా ప్రమోషన్ల (Movie Promotions) కోసం హిందీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలలో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఏ సినిమా రంగమైనా.. తెలుగు వారి ఆశీర్వాదం కోసం రావాల్సిందే అన్నట్లుగా బాలీవుడ్ సినిమా తయారైంది అంటూ నెటిజన్స్​ కామెంట్స్ పెడుతున్నారు. 

Read More: జపాన్ లోనూ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు తగ్గని జోరు.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ డిజైన్ పోస్టర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!