Kangana Ranaut: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్.. 'ఎమర్జెన్సీ' (Emergency) ఫస్ట్ లుక్ విడుదల!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వం తన దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి. ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే కంగనా రనౌత్ ఈ మధ్య వరుసగా ప్రముఖుల బయోపిక్ లల్లో నటిస్తోంది. ఆ మధ్య 'మణికర్ణిక' సినిమాలో స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయిగా అలరించిన కంగనా.. ఆ తర్వాత ‘తలైవి’ చిత్రంలో జయలలిత పాత్రలో మెప్పించింది.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ప్రస్తుతం మరో అడుగు ముందుకేసింది. ఏకంగా భారత ఉక్కు మహిళ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వీయదర్శకత్వంలో ఆమె ఈ సినిమాను తెరకెక్కించబోతోంది. ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ వీడియోను (Emergency First Look Video) చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో కంగన.. అచ్చం ఇందిరను మరిపించింది.‘అమెరికా ప్రెసిడెంట్‌కి చెప్పు.. ఇక్కడ అందరూ నన్ను మేడమ్ అని కాదు, సర్ అని పిలుస్తారని’ అనే డైలాగ్ తో ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్, హావభావాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలింస్ బ్యానర్ లోనే ఈ చిత్రం నిర్మిస్తున్నారని తెలిపింది.
ఇందిర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మణికర్ణికతో మెగా ఫోన్ పట్టిన కంగనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. కాగా, ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, భూమిక చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.