బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ‘ధాకడ్’ సినిమాకు 20 టికెట్లే అమ్ముడయ్యాయి.. రూ.85 కోట్లు నష్టం

Updated on Jun 04, 2022 01:53 PM IST
కంగనా రనౌత్ (Kangana Ranaut)
కంగనా రనౌత్ (Kangana Ranaut)

బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా నటించిన సినిమా ‘ధాకడ్‌’.  రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ మే 20న రిలీజైంది. సినిమా టీజర్‌, ట్రైలర్‌ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ధాకడ్‌’ మూవీలో కంగనా యాక్షన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారయ్యాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే దక్కిందని చెప్పుకోవాలి. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

సినిమా రిలీజ్‌ అయ్యి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గడిచింది. ఈ క్రమంలో శుక్రవారం దేశం మొత్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఈ టికెట్ల సేల్‌తో వచ్చిన వసూళ్లు కేవలం రూ.4,420 మాత్రమే. ధాకడ్ సినిమాను రూ. 90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఇప్పటివరకు ధాకడ్‌ నమోదు చేసిన షేర్‌ రూ.5 కోట్ల లోపు మాత్రమేనని ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్ల కంటే ఎక్కువనే చెప్పుకోవాలి.

కంగనా రనౌత్ (Kangana Ranaut)

ఇక, ధాకడ్ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేసినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేదని బీటౌన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాను తీసుకునేందుకు ఓటీటీ సంస్ధలులు కూడా ముందుకు రావట్లేదని సమాచారం. ఎప్పుడూ కాంట్రవర్సీల్లో ఉండే కంగనా రనౌత్‌ సినిమాలకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. స్టార్‌‌  హీరోయిన్‌గా ఉన్న కంగన సినిమాకు ఇంత దారుణమైన కలెక్షన్లు రావడం నిజంగా దారుణమే.

కాగా, ఇటీవల ‘ధాకడ్‌’ సినిమా ట్రైలర్‌‌ రిలీజ్ ఈవెంట్‌లో పలు కామెంట్లు చేసింది కంగన. తను మేల్ సెంట్రిక్ సినిమాలను తిరస్కరించిన సమయంలో అందరూ విమర్శించారని, పెద్ద హీరోల సినిమాలు చేయనని చెప్పినప్పుడు.. ఎందుకు కెరీర్ పాడు చేసుకుంటోందని అందరూ అనుకునేవారని చెప్పింది. అయితే మన భవిష్యత్తుపై మనకు పూర్తి విజన్ ఉన్నప్పుడు మనల్ని ఎవరూ ఏం చేయలేరని, మనలో ఏదో సమస్య ఉందని అందరూ అనుకుంటారని కామెంట్లు చేసింది కంగన (Kangana Ranaut).

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!