రామ్‌ పోతినేని (Ram Pothineni) వారియర్‌‌లో ‘బులెట్‌’ పాటకు స్టెప్పులేసిన అలనాటి డైరెక్టర్ భారతీరాజా

Updated on Jun 16, 2022 08:02 PM IST
రామ్‌ పోతినేని (Ram Pothineni) వారియర్‌‌ సినిమా పోస్టర్

రామ్‌ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ‘ది వారియర్‌‌’ సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ది వారియర్ సినిమాలో శింబు పాడిన బులెట్ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.

రిలీజ్ అయిన రోజు నుంచే యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతూ పది కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు సర్‌‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు లింగుస్వామి. ‘పదహారేళ్ల వయసు’ ఒరిజినల్‌ వెర్షన్‌ను డబ్‌ చేసి ’16 వయనితలే’ అనే సినిమాతో ఫస్ట్ సినిమాతోనే సూపర్‌‌హిట్ అందుకున్నాడు ఆనాటి దర్శకుడు భారతీరాజా.

రామ్‌ పోతినేని (Ram Pothineni) వారియర్‌‌ సినిమా పోస్టర్

కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో సూపర్‌‌హిట్‌ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకున్నారు భారతీరాజా. తెలుగులో కూడా ‘కొత్త జీవితాలు’, ‘ఆరాధన’, ‘సీతాకోకచిలుక’ వంటి క్లాసికల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘ది వారియర్’.

స్టెప్పులేసిన వీడియో..

శింబు పాడిన బులెట్‌ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా బులెట్‌ పాట పది కోట్ల వ్యూస్ సాధించిన సందర్భంగా దర్శకుడు లింగుస్వామి సర్‌‌ప్రైజ్ ప్లాన్ చేశారు. భారతీరాజాతో కలిసి బులెట్‌ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రిన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ది వారియర్ సినిమాలో రామ్‌ పోతినేని పవర్‌‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌ క్యారెక్టర్‌‌ పోషించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు.

టీజర్‌‌ కూడా.. ట్రెండింగ్‌లోనే

ది వారియర్ సినిమా టీజర్‌‌కు తెలుగు, తమిళంలో 20 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) క్యారెక్టర్‌‌ను పవర్‌‌ఫుల్‌గా చూపించేలా టీజర్‌‌ను కట్‌ చేసి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌కు తగినట్టుగానే విలన్‌ ఆది పినిశెట్టి పాత్రను కూడా అంతే పవర్‌‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు.

టీజర్‌‌తోపాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. నదియా, అక్షరగౌడ, భారతీరాజా కీలకపాత్రల్లో నటించిన ది వారియర్ సినిమా జూలై 14వ తేదీన విడుదల కానుంది.

Read More: రామ్ పోతినేని (Ram Pothineni): “ది వారియర్” సినిమాలో దుమ్మురేపిన మన ఇస్మార్ట్ శంకర్

కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో సూపర్‌‌హిట్‌ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకున్నారు భారతీరాజా. తెలుగులో కూడా ‘కొత్త జీవితాలు’, ‘ఆరాధన’, ‘సీతాకోకచిలుక’ వంటి క్లాసికల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘ది వారియర్’.

స్టెప్పులేసిన వీడియో..

శింబు పాడిన బులెట్‌ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా బులెట్‌ పాట పది కోట్ల వ్యూస్ సాధించిన సందర్భంగా దర్శకుడు లింగుస్వామి సర్‌‌ప్రైజ్ ప్లాన్ చేశారు. భారతీరాజాతో కలిసి బులెట్‌ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రిన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ది వారియర్ సినిమాలో రామ్‌ పోతినేని పవర్‌‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌ క్యారెక్టర్‌‌ పోషించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు.

టీజర్‌‌ కూడా.. ట్రెండింగ్‌లోనే

ది వారియర్ సినిమా టీజర్‌‌కు తెలుగు, తమిళంలో 20 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) క్యారెక్టర్‌‌ను పవర్‌‌ఫుల్‌గా చూపించేలా టీజర్‌‌ను కట్‌ చేసి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌కు తగినట్టుగానే విలన్‌ ఆది పినిశెట్టి పాత్రను కూడా అంతే పవర్‌‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!