కంగనారనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న ‘ఎమ‌ర్జెన్సీ’ నుంచి అట‌ల్ బిహారీ వాజపేయి క్యారెక్టర్‌‌ ఫస్ట్‌ లుక్

Updated on Jul 27, 2022 05:58 PM IST
కంగనారనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న ‘ఎమ‌ర్జెన్సీ’ సినిమాలో అట‌ల్ బిహారీ వాజపేయి క్యారెక్టర్‌‌ చేస్తున్న శ్రేయస్ తల్పడే ఫస్ట్‌ లుక్
కంగనారనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న ‘ఎమ‌ర్జెన్సీ’ సినిమాలో అట‌ల్ బిహారీ వాజపేయి క్యారెక్టర్‌‌ చేస్తున్న శ్రేయస్ తల్పడే ఫస్ట్‌ లుక్

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న సినిమా 'ఎమ‌ర్జెన్సీ '. దేశంలో 'ఎమ‌ర్జెన్సీ ' విధించిన స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిణామాలు, పరిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ క్యారెక్టర్‌‌లో న‌టిస్తున్న కంగ‌నా రనౌత్ ఫస్ట్‌ లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ఎమ‌ర్జెన్సీ విధించిన టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబ‌డిన పొలిటిక‌ల్ లీడ‌ర్‌ 'జ‌య‌ప్రకాష్‌ నారాయ‌ణ్ ' (జేపీ) పాత్ర పోషిస్తున్న అనుప‌మ్ ఖేర్ లుక్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆస‌క్తిక‌ర అప్‌డేట్ కూడా ఇండ‌స్ట్రీలో చ‌క్కర్లు కొడుతోంది.

కంగనారనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న ‘ఎమ‌ర్జెన్సీ’ సినిమా పోస్టర్లు

పోరాడిన విధానాన్ని..

ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాడిన లీడర్ అటర్ బిహారీ వాజపేయి క్యారెక్టర్‌‌లో హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన శ్రేయాస్‌ తల్పడే నటించారు. తాజాగా ఆయన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సమయంలో వాజపేయి ఎటువంటి పోరాటం చేశారు? అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 'ఎమర్జెన్సీ '  చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

కంగ‌నా రనౌత్ (Kangana Ranaut) సొంత బ్యాన‌ర్ 'మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ ' పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా 'ఎమర్జెన్సీ ' సినిమాను నిర్మిస్తున్నారు. కంగనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. భూమికా చావ్లా మరో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు.

Read More : వాళ్ల లుక్స్‌ భయానకంగా ఉంటున్నాయి.. బాలీవుడ్‌పై సంచలన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ (Kangana Ranaut)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!