వాళ్ల లుక్స్‌ భయానకంగా ఉంటున్నాయి.. బాలీవుడ్‌పై సంచలన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ (Kangana Ranaut)

Updated on May 16, 2022 06:07 PM IST
కంగనా రనౌత్ (Kangana Ranaut)
కంగనా రనౌత్ (Kangana Ranaut)

ఎప్పుడూ సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ (Kangana Ranaut).. బాలీవుడ్‌పై మరోసారి విమర్శలు చేసింది. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా టాలెంట్, లుక్స్‌ ఉన్న వాళ్లకు అవకాశాలు దక్కడం లేదని కామెంట్స్‌ చేసింది కంగన. ఆమె నటించిన ‘థాకడ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కంగన మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్టార్‌‌ కిడ్స్‌కే బాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. అదే సమయంలో సౌత్‌ సినిమాలను పొగడ్తలతో ముంచెత్తింది.

‘సౌత్ వాళ్లు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. వాళ్లు ఎటువంటి పాత్రలోనైనా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమానే తీసుకుంటే.. అందులో హీరో కూలీ పని చేసే వ్యక్తిగా కనిపించాడు. బాలీవుడ్‌ హీరోలు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అటువంటి పాత్రలు చేశారా? సౌత్‌ సినిమాల్లో వాళ్ల సంస్కృతి, సాంప్రదాయానికి ప్రాధాన్యత ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేమికులు వాళ్ల సినిమాలకు, కథలకు కనెక్ట్ అవుతున్నారు. బాలీవుడ్‌ నుంచి ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో బాలీవుడ్‌ స్టార్ల పిల్లలే ఇంపార్టెంట్‌ క్యారెక్టర్లు చేస్తున్నారు. చిన్నతనం నుంచి ఫారిన్‌లో పెరిగిన స్టార్ల పిల్లలు.. అక్కడి కల్చర్‌‌కు అలవాటు పడిపోయారు. వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ అక్కడి లాగే ఉంటాయి. వాళ్ల లుక్స్‌ భయానకంగా, ఉడకబెట్టిన కోడిగుడ్ల లాగా ఉంటాయి. అలా ఉంటే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు’ అని కంగన విమర్శలు చేసింది.

హీరో అడివి శేష్ న‌టించిన మేజ‌ర్ ప్రమోష‌న్ కోసం మ‌హేష్ బాబు వెళ్లారు. బాలీవుడ్‌లో న‌టిస్తారా అని మ‌హేష్ బాబును ఓ రిపోర్టర్ అడిగారు. తాను తెలుగు సినిమాలో స్టార్ హీరో అని.. తెలుగు సినిమాలే చేస్తాన‌ని మ‌హేష్ బాబు అన్నారు. త‌న‌కు ఇంత పెద్ద స్టార్ డ‌మ్ వ‌చ్చిన త‌ర్వాత హిందీలో సినిమాలు తీసి అక్క‌డ మ‌ళ్లీ స్టార్ డ‌మ్ తెచ్చుకోవ‌డానికి టైం వేస్ట్ చేయాల‌నుకోవ‌డం లేద‌న్నారు. బాలీవుడ్ త‌న రేంజ్‌కు త‌గ్గ సినిమాలు తీయాలంటే భ‌రించ‌లేద‌న్నారు. హిందీ సినిమాల‌కు సంబంధించి చాలా ఆఫ‌ర్లు త‌న‌కు వ‌చ్చాయ‌ని.. కానీ తాను హిందీ సినిమాలు చేయ‌న‌ని మ‌హేష్ చెప్పారు. ప్ర‌స్తుతం నార్త్ సినిమా వాళ్లు తెలుగు సినిమా వైపు చూస్తున్నార‌న్నారు. మ‌న తెలుగులో పాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్నాయని మ‌హేష్ చెప్పారు

మహేష్ బాబు చేసిన కామెంట్స్‌లో త‌ప్పులేద‌ని బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా అన్నారు. హిందీ సినిమాల్లో న‌టించాల‌ని చాలా మంది బాలీవుడ్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.  కానీ ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌లో ఉంది. సో అంత‌టి రెమ్యున‌రేష‌న్ బాలీవుడ్ మ‌హేష్ బాబుకు ఇవ్వలేద‌ని కంగనా (Kangana Ranaut) రియాక్డ్ అయింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!