టాలీవుడ్‌ (Tollywood)లో మరో విషాదం.. డైరెక్టర్ బాబీ (Bobby) తండ్రి మృతి

Updated on Aug 28, 2022 10:08 PM IST
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు బాబి (Bobby) తండ్రి మోహన్‌రావు అనారోగ్యంతో మరణించారు
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు బాబి (Bobby) తండ్రి మోహన్‌రావు అనారోగ్యంతో మరణించారు

టాలీవుడ్ (Tollywood)లో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు బాబి ఇంట్లో విషాదకరమైన సంఘటన జరిగింది. బాబీ తండ్రి మోహన్‌రావు మరణించారు. కొంత కాలం నుంచి లివర్‌‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు మోహన్‌రావు.

హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో కొంతకాలంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.  మోహన్‌రావు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

దర్శకుడు బాబీ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ‘వాల్తేరు వీర‌య్య’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ సినిమాలో కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో చిత్రంలో చిరంజీవి అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలను  మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు.

Read More : ఇండస్ట్రీకి నంబర్ వన్ హీరో అవుతానని అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) అప్పుడే అన్నారు: సోదరుడు నాగబాబు (Nagababu)


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!