ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ సినిమాటోగ్రాఫర్ , దర్శకుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మృతి

Updated on Aug 19, 2022 11:42 PM IST
ఆ నలుగురు సినిమా దర్శకుడు చంద్ర సిద్దార్ధ్‌ సోదరుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు
ఆ నలుగురు సినిమా దర్శకుడు చంద్ర సిద్దార్ధ్‌ సోదరుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)  మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్‌ 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' సినిమాకు దర్శకత్వం వహించిన చంద్ర సిద్ధార్థ్‌కు సోదరుడు రాజేంద్రప్రసాద్. 

తెలుగులో 'నిరంతరం (1995)’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా  వ్యవహరించారు. నిరంతరం సినిమా పలువురి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది.  

రాజేంద్ర ప్రసాద్‌ పుట్టి పెరిగింది తెలంగాణలోని హైదరాబాద్‌లో. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే జరుగగా.. పుణెలోని ఓ ప్రముఖ ఫిల్మ్‌ స్కూల్‌లో సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు రాజేంద్రప్రసాద్. పలు ఇంగ్లీష్‌, పర్షియన్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించారు.

 హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Read More : మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ టీజర్ విడుదల ఎప్పుడంటే?


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!