చంద్రబోస్ (Chandrabose) కలం నుంచి జాలువారిన మరో ప్రేమగీతం.. శ్రోతలను అలరిస్తున్న ‘నీతోనే.. నీతోనే..’

Updated on Oct 06, 2022 08:05 PM IST
దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా అహింస. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘నీతోనే నీతోనే’ పాట శ్రోతలను అలరిస్తోంది
దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా అహింస. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘నీతోనే నీతోనే’ పాట శ్రోతలను అలరిస్తోంది

ఒక సినిమా విజయం కథ, కథనం మీద ఎంత ఆధారపడి ఉంటుందో సంగీతం , సాహిత్యం మీదా అంతే ఆధారపడి ఉంటుంది.  పాటల్లోని  సంగీతం శ్రోతలను ఆహ్లాదపరిస్తే దానిలోని సాహిత్యం వారిని ఆలోచింపజేస్తుంది.అలాంటి పాటలు రాసే అతికొద్దిమంది సినీ గేయరచయితల్లో చంద్రబోస్ (Chandrabose) ఒకరు.

‘తాజ్​ మహల్​’ చిత్రంలోని ‘మంచుకొండల్లోని చంద్రమా..’ పాటతో సినీ ఇండ్రస్టీలోకి అడుగుపెట్టారు చంద్రబోస్​. ఇప్పటివరకు దాదాపు 850కిపైగా సినిమాల్లో 3,600 పైచిలుకు పాటలు రాశారు. 

మనసుకు హత్తుకునే సాహిత్యం..

చంద్రబోస్​  రాసిన ‘నీ నవ్వుల తెల్లదనాన్ని..’, ‘చీకటితో వెలుగే చెప్పెను..’ పాటలకు నంది, ఫిలింఫేర్​, సైమా అవార్డులు అందుకున్నారు.  ఆయన కలం నుంచి జాలు వారిన మరో అద్భుత గీతం అహింస సినిమాలోని ‘నీతోనే.. నీతోనే..’. ఈ పాటలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే నమ్మకం, భావాలను మనసుకు హత్తుకునేలా వర్ణించారు చంద్రబోస్​.  సిద్​ శ్రీరామ్, సత్య యామిని​ గాత్రం ఈ పాటను అభిమానులకు మరింత దగ్గరచేసింది.

భావయుక్తమైన సాహిత్యంతో స్వరపరిచిన పాటలు ఎన్ని రోజులైనా ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. అందరినీ అలరిస్తూనే ఉంటాయి. అలాంటి పాటల జాబితాలో చేరిన ఈ పాట విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్లలో వ్యూస్‌ను​ సొంతం చేసుకుని యూట్యూబ్​లో దూసుకుపోతుంది.

దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా అహింస. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన ‘నీతోనే నీతోనే’ పాట శ్రోతలను అలరిస్తోంది

తేజ దర్శకత్వంలో..

ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనుమడు దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు.​  చాలాకాలం తర్వాత ఆర్‌‌పీ పట్నాయక్​  సంగీతం అందిస్తున్న సినిమా ఇది.

ఆనంది ఆర్ట్​ క్రియేషన్స్​ బ్యానర్​పై పి.కిరణ్​ అహింస సినిమాను నిర్మిస్తున్నారు.  అభిరామ్​ సరసన గీతిక తివారి హీరోయిన్​గా నటిస్తుండగా నటి సదా, కమల్​ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్​, లిరికల్​ సాంగ్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

Read More : God Father Movie Review : రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!