గాయ‌ని శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi) పై అన్న‌మ‌య్య వంశ‌స్తుల ఆగ్ర‌హం!

Updated on Jul 20, 2022 02:00 PM IST
అన్న‌మ‌య్య సంకీర్త‌న చిత్రీక‌ర‌ణ‌లో శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi)  కాళ్లు ఊపుతూ క‌నిపించారు.
అన్న‌మ‌య్య సంకీర్త‌న చిత్రీక‌ర‌ణ‌లో శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi) కాళ్లు ఊపుతూ క‌నిపించారు.

టాలీవుడ్ గాయ‌ని శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi) వివాదంలో చిక్కుకున్నారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ను ఆల‌పించిన విష‌యంలో శ్రావ‌ణ భార్గ‌వికి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అన్న‌మ‌య్య సంకీర్త‌న చిత్రీక‌ర‌ణ‌లో శ్రావ‌ణ భార్గ‌వి కాళ్లు ఊపుతూ క‌నిపించారు. ఈ విష‌యంతో పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగింది. తాను చేసింది త‌ప్పు కాద‌ని శ్రావ‌ణ భార్గ‌వి చెబుతున్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే..

వివాదంలో గాయ‌ని
టాలీవుడ్‌లో శ్రావ‌ణ భార్గ‌వి  (Sravana Bhargavi) ప్ర‌ముఖ‌ గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో పాట‌ల‌ను ఆల‌పించారు. ఎన్నో మ్యూజిక్ షోల‌కు యాంక‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.ఈ యువ గాయ‌ని సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఇటీవ‌ల శ్రావ‌ణ భార్గ‌వి ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టారు. ఆ ఛాన‌ల్‌లో తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్త‌న‌ను ఆల‌పించారు.

అన్న‌మ‌య్య సంకీర్త‌న పాడ‌డంతో పాటు శ్రావణ భార్గ‌వి వివిధ భంగిమ‌ల్లో పాట‌ను చిత్రీక‌రించారు. అంతేకాదు కాళ్లు ఊపుతూ వీడియోలో క‌నిపించారు. భ‌క్తి పాట‌ల‌పై శ్రావ‌ణ భార్గ‌వి ఇలా చేయ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదని అన్నమయ్య వంశ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కోర్టుకు వెళ‌తాం - అన్న‌మ‌య్య వంశ‌స్తులు
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొదటగా తన పద సంకీర్తనలతో మెప్పించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యులు. శ్రావ‌ణ భార్గ‌వి అన్న‌మ‌య్య సంకీర్త‌న ఆల‌పించిన వీడియోలో కాళ్లు ఊప‌డంపై అన్న‌మ‌య్య వంశ‌స్తులు మండిప‌డుతున్నారు. 

అన్నమాచార్యుల పెద్దకుమారులు పెదతిరుమలాచార్యులు సాక్ష్యాత్తూ స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ కీర్తించిన పాటను శ్రావ‌ణ భార్గ‌వి త‌ప్పుగా ఎలా చిత్రీక‌రిస్తార‌న్నారు. ఈ విషయాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ‌తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే కోర్టుకు కూడా వెళ్తామని అన్న‌మ‌య్య వంశ‌స్తుడైన హరినారాయణచార్యులు తెలిపారు. 

త‌ప్పు చేయ‌లేదు - శ్రావ‌ణ భార్గ‌వి
శ్రావ‌ణ భార్గ‌వి (Sravana Bhargavi) మాత్రం తాను చేసింది త‌ప్పు కాద‌ని చెబుతున్నారు. 'ఒకపరి ఒకపరి వయ్యారమే' అన్న శృంగార కీర్తనను తాము ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. తాను చేసింది త‌ప్పు అయితే ఆ భ‌గ‌వంతుడే చూసుకుంటార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Read More:  Annamayya : 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన‌ అన్న‌మ‌య్య ఓ అద్భుతం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!