Highway Trailer: 'వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్'.. ఆసక్తికరంగా 'హైవే' ట్రైలర్!

Updated on Aug 16, 2022 08:35 PM IST
'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకోకిల్లర్' అంటూ టీవీలో వస్తున్న న్యూస్ తో ఈ ట్రైలర్ (HighwayTrailer) మొదలవుతోంది.
'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకోకిల్లర్' అంటూ టీవీలో వస్తున్న న్యూస్ తో ఈ ట్రైలర్ (HighwayTrailer) మొదలవుతోంది.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ 'హైవే' (Highway) చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. టాలీవుడ్‌లో 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌', 'పుష్పక విమానం' వంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్‌.. ప్రస్తుతం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేయడానికి వస్తున్నాడు.

సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మానస హీరోయిన్ గా.. అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. హైవే సినిమా నేరుగా ఓటీటీ 'ఆహా'లో ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 'ఆహా' (Aha) నేడు యూట్యూబ్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.     

'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్' అంటూ టీవీలో వస్తున్న న్యూస్ తో ఈ ట్రైలర్ (Highway Trailer) మొదలవుతోంది. ఒక యువతి సైకో వలలో చిక్కుకోవడం.. ఒక వైపున పోలీసులు.. మరో వైపున హీరో ఆ యువతిని కాపాడటానికి ప్రయత్నిస్తుండటంపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఆ సైకో బారి నుంచి ఆ అమ్మాయిని వాళ్లు కాపాడారా లేదా? అనే విషయం అర్థమవుతోంది.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం లో జాన్‌ విజయ్‌, రేష్మ పసుపులేటి, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. '118' మూవీ ఫేమ్‌ కేవీ గుహన్‌ (KV Guhan) డైరెక్షన్‌లో ఈ హైవే మూవీ రానుండటం విశేషం. నందమూరి కల్యాణ్‌రామ్‌తో 118 మూవీలో మ్యాజిక్‌ చేశాడు కేవీ గుహన్‌. ఇప్పుడు హైవే ట్రైలర్‌ చూస్తుంటే.. అంతకు మించిన థ్రిల్లర్‌ను అందించినట్లే కనిపిస్తున్నాడు.   

Read More: Salaar Release Date: ప్రభాస్ 'సలార్' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఖరారు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!