'పుష్ప‌ 2' (Pushpa 2) : స్క్రిప్ట్ విషయంలో తగ్గేదేలే అంటున్న నిర్మాతలు

Updated on Apr 26, 2022 11:11 AM IST
ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీలో పుష్ఫ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. పుష్ప సినిమా కూడా కేజీఎఫ్2 లానే పార్ట్ 2 తీసున్నారు. పుష్ప‌2(Pushpa2) రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేలా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 
ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీలో పుష్ఫ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. పుష్ప సినిమా కూడా కేజీఎఫ్2 లానే పార్ట్ 2 తీసున్నారు. పుష్ప‌2(Pushpa2) రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేలా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 

ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీలో పుష్ఫ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. పుష్ప సినిమాని కూడా కేజీఎఫ్ 2 లానే పార్ట్ 2 తీస్తున్నారు. దాంతొ పుష్ప‌ 2 (Pushpa 2) చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

Pushpa   & KGF

కేజీఎఫ్2 సినిమా  హీట్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. హిందీలో కూడా కేజీఎఫ్ 2 కాసుల వ‌ర్షం కురిపించింది. కేజీఎఫ్2 కంటే ముందు వ‌చ్చిన పుష్ఫ సినిమా కూడా హిందీలో 300 కోట్ల  రూపాయ‌లు కొల్ల‌గొట్టింది. ఇండియాలోనే పుష్ప‌, కేజీఎఫ్2 సినిమాలు క్రేజ్ సంపాదించుకున్నాయి. కేజీఎఫ్ 2 సినిమా ఎఫెక్ట్ క‌చ్చితంగా పుష్ప 2(Pushpa 2) పై ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 

కేజీఎఫ్ 1 సినిమా కంటే కేజీఎఫ్ 2 సినిమాను మ‌రింత జాగ్రత్తగా, ప్రేక్షకులు మెచ్చేలా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించారు. యాక్ష‌న్ సీన్స్, డైలాగ్స్, సెంటిమెంట్, విజువ‌ల్ ఎఫెక్ట్.. ఇలా ఏ సీనైనా కేజీఎఫ్1 సినిమాతో పోలిక లేకుండా కొత్త‌ద‌నం తీసుకొచ్చారు. య‌శ్ కూడా త‌న కాస్టూమ్స్, యాక్టింగ్‌లో కేజీఎఫ్ 2 సినిమాలో న్యూ లుక్‌తో అద‌ర‌గొట్టారు. 

Pushpa 2  & KGF 2

ఇక పుష్పలో ఒక సాధారణ కూలీ దగ్గర నుంచి.. ఎర్ర‌చంద‌నం సిండికేట్ పార్ట్‌న‌ర్ అయ్యే వ‌ర‌కు అల్లు అర్జున్ పాత్రను చ‌క్క‌గా చూపించారు ద‌ర్శ‌కుడు సుకుమార్. నెక్ట్ సినిమా పుష్ప‌ 2లో ఎర్ర‌చంద‌నం సిండికేట్‌ను ఎలా రూల్ చేస్తాడో చూపించ‌నున్నారు. అయితే కేజీఎఫ్ 2 ఎఫెక్ట్ క‌చ్చితంగా పుష్ప2పై ఉంటుద‌ట‌. కేజీఎఫ్ 2 రికార్డులు చూసి,  సుకుమార్ పుష్ప‌ 2 సినిమాపై ఫుల్ క్లారీటీతో ఉన్నార‌ట‌. 


 

Pushpa 2

ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్2ను హై రేంజ్ స్టోరీతో ఎలాగైతే అద‌ర‌గొట్టారో.. సుకుమార్ కూడా పుష్ప‌ 2 (Pushpa2) ను  అంత‌కు మించి తెరకెక్కించ‌నున్నార‌ట‌. పుష్ప‌ 2 కు ముందు అనుకున్న స్కిప్ట్‌లో చాలా మార్పులు చేస్తున్నార‌ట‌. అల్లు అర్జున్ సీన్స్, డైలాగులు భారీగా పెంచార‌ట‌. 'పుష్ప ది రూల్' సినిమా స్టోరీలో ఎక్క‌డా త‌గ్గేదేలేదంటున్నారు సుకుమార్. పుష్ప‌ 2 లో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నార‌ట‌. అల్లుఅర్జున్ (Allu Arjun), సునీల్ శెట్టి (Suniel Shetty) మ‌ధ్య ఉండే సీన్స్ బాక్పాపీస్ షేక్ చేసేలా ఉంటాయ‌ట‌. 


ఒక సినిమాతోనే హిట్ కొట్ట‌డం క‌ష్టమవుతున్న ఈ రోజుల్లో... ప్ర‌శాంత్ నీల్, రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్లు రెండు పార్టులుగా సినిమాల‌ను రిలీజ్ చేసి ద‌మ్మున్న ద‌ర్శ‌కుల‌మంటూ నిరూపించుకున్నారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా రెండు సినిమాల‌తో త‌న టాలెంట్ ఏంటో చూపిస్తానంటున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!