కేఎఫ్‌సీ యాడ్‌లో ఇర‌గ‌దీసిన 'పుష్ప‌రాజ్' (Allu Arjun).. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ త‌గ్గేదేలే అంటున్న అల్లు అర్జున్

Updated on Aug 27, 2022 07:09 PM IST
అల్లు అర్జున్  (Allu Arjun) ఫాలోయింగ్ చూసిన ప‌లు సంస్థ‌లు తమ బ్రాండ్ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించుకోవాల‌ని చూస్తున్నాయి.
అల్లు అర్జున్  (Allu Arjun) ఫాలోయింగ్ చూసిన ప‌లు సంస్థ‌లు తమ బ్రాండ్ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించుకోవాల‌ని చూస్తున్నాయి.

టాలీవుడ్​లో ఐకాన్​స్టార్​  అల్లు అర్జున్ (Allu Arjun) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. సీరియ‌స్, కామెడీ, యాక్ష‌న్ ఇలా  ఏ సీన్‌లో అయినా అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు మెచ్చేలా న‌టిస్తారు. అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా త‌రువాత పాన్ ఇండియా హీరోగా మారారు. 'పుష్ప 2' షూటింగ్ కోసం అల్లు అర్జున్ సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ అల్లు అర్జున్ ఫుల్ బిజీగా మారారు. 

కేఎఫ్‌సీ కోసం అల్లు అర్జున్ (Allu Arjun)  చేసిన యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కేఎఫ్‌సీ సంస్థ ఏకంగా ఏడు భాష‌ల్లో అల్లు అర్జున్‌తో యాడ్ చేయించింది. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' స్టైల్‌లో అద‌ర‌గొట్టారు. ద‌ర్శ‌కుడు క్రిష్ కేఎఫ్‌సీ యాడ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  కేఎఫ్​సీకి బ్రాండ్​అంబాసిడర్​గా అల్లు అర్జున్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పటికే బ‌న్ని రాపిడో, జొమాటో, అభి బస్ ​వంటి బ్రాండ్స్​కు అంబాసిడర్​గా ఉన్నారు.  

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అల్లు అర్జున్ లుక్స్ కొత్త‌గా క‌నిపిస్తున్నాయి.రీసెంట్‌గా కోకాకోలా యాడ్‌లో అల్లు అర్జున్ అద‌ర‌గొట్టారు. కొరియ‌న్ అమ్మాయిల‌తో చేసిన డాన్సులు వైర‌ల్‌గా మారాయి. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ మ‌రో యాడ్‌లో న‌టిస్తున్నారు. 

ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా బ‌న్ని

అల్లు అర్జున్ (Allu Arjun) ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. 'ఆహా', 'OLX', 'Colgate', 'రాపిడో', 'జొమాటో, రెడ్ బ‌స్, అస్ట్రాల్, కేఎఫ్‌సీ వంటి యాడ్స్‌లో న‌టించారు. అల్లు అర్జున్ ఒక్కో యాడ్ కోసం రూ. 7.5 కోట్లు తీసుకుంటున్నార‌ని  స‌మాచారం. అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసిన ప‌లు సంస్థ‌లు తమ బ్రాండ్ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించుకోవాల‌ని చూస్తున్నాయి.

Read More: అల్లు అర్జున్ (Allu Arjun) తో క‌లిసి కోకాకోలా యాడ్‌లో ర‌చ్చ చేసిన కొరియ‌న్ గ‌ర్ల్స్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!