‘ఆషికీ 2’ హీరోతో ‘లైగర్’ హీరోయిన్ ప్రేమాయణం!.. ఆదిత్య (Aditya Roy Kapoor)తో అనన్య (Ananya Pandey) డేటింగ్?

Updated on Oct 22, 2022 03:35 PM IST
‘లైగర్’ (Liger) ఫేమ్ అనన్యా పాండే (Ananya Pandey) ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ (Bollywood)లో గుసగుసలు వినిపిస్తున్నాయి
‘లైగర్’ (Liger) ఫేమ్ అనన్యా పాండే (Ananya Pandey) ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ (Bollywood)లో గుసగుసలు వినిపిస్తున్నాయి

అనతి కాలంలోనే బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది అనన్యా పాండే (Ananya Pandey). ఈ యంగ్ బ్యూటీ ‘లైగర్’ (Liger)తో పాన్ ఇండియా హిట్ కొడదామని భావించినా.. పూర్తిగా నిరాశే మిగిలింది. సాధారణ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2’తో వెండితెర పైకి రంగప్రవేశం చేసిన అనన్య.. ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘కాలీ పీలీ’ లాంటి మూవీలతో ఆడియెన్స్‌ను అలరించారు. ఇటీవల పాన్ ఇండియా సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’లోనూ ఆమె కథానాయికగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఫలితం మాత్రం ఆమెను నిరాశపర్చింది. 

‘లైగర్’ చిత్రంతో హిందీతోపాటు తెలుగులోనూ మంచి హిట్ కొడదామని చూసిన అనన్యా పాండేకు నిరుత్సాహమే మిగిలింది. సినిమా ఎలా ఉన్నా.. ఇందులో ఆమె నటనపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు రావడం గమనార్హం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. అనన్యా పాండేకు సంబంధించి ఓ వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. హిందీ చిత్రపరిశ్రమలోని ఓ హీరోతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

‘ఆషికీ 2’ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor)తో అనన్యా పాండే ప్రేమాయణాన్ని నడుపుతోందని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సమాచారం. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్​ జోహర్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్–7’ షోలో ఈమధ్య అనన్య పాల్గొన్నారు. అందులో ఆమె మాట్లాడుతూ.. ఆదిత్య రాయ్ కపూర్ హాట్‌గా ఉంటాడని చెప్పారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

జంటగా పార్టీలకు హాజరు

దీపావళి సందర్బంగా బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తాజాగా ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ అనంతరం ఆదిత్య, అనన్య జంటగా ఫొటోలకు ఫోజులిచ్చారు. వాళ్లిద్దరూ నవ్వుతూ కనిపించారు. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారనే పుకార్లకు మరింత బలం చేకురినట్లయ్యింది. ‘ఆదిపురుష్’లో నటిస్తున్న కృతి సనన్ ఇచ్చిన విందులోనూ ఆదిత్య, అనన్య క్లోజ్‌గా కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ  మాట్లాడుకుంటున్నారు. మరి, ఆదిత్య, అనన్యలు ఈ గాసిప్స్‌పై స్పందిస్తారేమో చూడాలి. ఇక, అనన్య కెరీర్ విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా కనిపించనున్నారు. ‘ఖో గయే హమ్ కహా’ అనే ప్రాజెక్టు కూడా ఆమె చేతిలో ఉంది. 

Read more: జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)కు సూపర్ క్రేజ్.. తారక్‌ను చూసి ఏడ్చేసిన లేడీ ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!