జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)కు సూపర్ క్రేజ్.. తారక్‌ను చూసి ఏడ్చేసిన లేడీ ఫ్యాన్స్

Updated on Oct 22, 2022 11:20 AM IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ప్రమోషన్స్ కోసం జపాన్‌కు వెళ్లిన తారక్ (Jr NTR).. అభిమాన నటుడ్ని చూసిన ఆనందంలో ఏడ్చేసిన మహిళా ఫ్యాన్స్
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ప్రమోషన్స్ కోసం జపాన్‌కు వెళ్లిన తారక్ (Jr NTR).. అభిమాన నటుడ్ని చూసిన ఆనందంలో ఏడ్చేసిన మహిళా ఫ్యాన్స్

భారతీయ సినిమా ఎల్లలు లేకుండా దూసుకెళ్తోంది. విదేశాల్లోని సినీ ప్రేక్షకులకూ వినోదాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అరబ్, యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఇండియన్ సినిమాకు మంచి పేరుంది. ముఖ్యంగా బాలీవుడ్ మూవీలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి రాకతో సౌత్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు చిత్రాలకు విదేశాల్లో భారీ మార్కెట్ ఏర్పడింది. జక్కన్న తీసిన ‘ఆర్ఆర్ఆర్’ యూఎస్‌లో సృష్టిస్తున్న హంగామా అంతాఇంతా కాదు. రిలీజై దాదాపు ఆర్నెళ్లు గడిచినా.. ఇప్పటికీ అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోలు వేస్తున్నారంటే రాజమౌళి మేకింగ్‌కు అక్కడి ప్రేక్షకులు ఎంతగా ముగ్ధులయ్యారో అర్థం చేసుకోవచ్చు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తాజాగా జపాన్‌లో విడుదల చేశారు. భారతీయ సినిమాలను జపనీయులు బాగా ఇష్టపడతారు. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది జపాన్ ఫ్యాన్స్ ఆరాధిస్తారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్‌కు జపనీయులు పడిచస్తారంటే నమ్మండి. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన తారక్‌కు అక్కడి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. కొంతమంది లేడీ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన నటుడ్ని చూశామన్న ఆనందంలో కంటతడి కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.  

జపనీస్‌లో మాట్లాడిన జూనియర్

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి’ అని జపనీస్ ఆడియెన్స్‌ను తారక్ కోరారు. ఆయన ఏమాత్రం తడబడకుండా జపనీస్‌లో మాట్లాడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి, జపాన్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూలు చేస్తుందో చూడాలి. 

Read more: Junior NTR: యంగ్ టైగర్ “జూనియర్ ఎన్టీఆర్” సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన టాప్ 10 పాత్రలు ఇవే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!