రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారు.. ఆదిపురుష్ (Adipurush) దర్శకుడిపై కేజీఎఫ్ నటి ఫైర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ ఇటీవలే రిలీజైంది. అయితే ఈ టీజర్ మీద మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ టీజర్ అద్భుతమని.. విజువల్ వండర్‌ను తలపిస్తోందని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం టీజర్‌లో ప్రభాస్ లుక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగా లేవని పెదవి విరుస్తున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘విక్రమ సింహా’ను ఇది గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కొందరు నెటిజన్స్ మాత్రం హాలీవుడ్ చిత్రాల బడ్జెట్‌తో పోలిస్తే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తక్కువ నిర్మాణ వ్యయంతో, మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకునేలా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌పై నటి, బీజేపీ నేత మాళవికా అవినాష్ మండిపడ్డారు. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ‘ఆదిపురుష్’ సినిమా తీశారంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. మన చరిత్రను, రామాయణాన్ని బాలీవుడ్ దర్శకులు తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు
‘లంకకు చెందిన రావణుడు శివ భక్త బ్రాహ్మణుడు. అరవై నాలుగు కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠాన్ని కాపాడుతున్న జయ శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు. కానీ మన చరిత్రను, రామాయణాన్ని బాలీవుడ్ డైరెక్టర్లు తప్పుగా చూపిస్తున్నారు. ఇక దీన్ని ఆపండి’ అని మాళవికా అవినాష్ ట్వీట్ చేశారు.
‘బహుశా వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటా. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది’ అని మాళవిక అన్నారు.
‘భూకైలాస్’లో సీనియర్ ఎన్టీఆర్ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్‌లో రావణుడు నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసుకున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం భారత దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రంలో రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది’ అని మాళవిక అసహనం వ్యక్తం చేశారు. కాగా కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో మాళవిక అవినాష్ మంచి పేరును సంపాదించారు.
ఇకపోతే, ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read more: 24 గంటలు..101 మిలియన్ వ్యూస్..! ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) టీజర్ రికార్డు