Saregamapa Singing Superstar: మీ ఓటుతో .. మీ అభిమాన సింగర్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Updated on May 22, 2022 06:35 PM IST
ఈ నెల 16 నుండి 22 తేది వరకు సరిగమప ప్రేక్షకులకు, తమ అభిమాన సింగర్స్‌ని ఓటింగ్ ద్వారా మళ్లీ షోలోకి ఆహ్వానించే అరుదైన అవకాశం లభించింది. 
ఈ నెల 16 నుండి 22 తేది వరకు సరిగమప ప్రేక్షకులకు, తమ అభిమాన సింగర్స్‌ని ఓటింగ్ ద్వారా మళ్లీ షోలోకి ఆహ్వానించే అరుదైన అవకాశం లభించింది. 

జీ తెలుగు వారి ప్రీమియర్ పాటల రియాలిటీ షో "Saregamapa - The Singing Super Star" ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని, సంగీత అభిమానులను అందరినీ అలరిస్తోంది. గీతా మాధురి, రేవంత్, సాకేత్, శ్రీ కృష్ణ మొదలైన గాయనీ, గాయకులు ఈ షోలో సెలబ్రిటీ మెంటర్స్‌గా, కంటెస్టెంట్స్‌కు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వారి విజయంలో తమదైన పాత్రను పోషిస్తున్నారు.

అలాగే ప్రముఖ సంగీత దర్శకులు కోటి, గాయనీమణులు ఎస్పీ శైలజ, స్మిత, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఇప్పటికి 12 మంది గాయకులు ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వీరిలో కొందరిని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఆహ్వానించే అవకాశం ఉంది. 

స్వరూప్ కార్తిక్, మైనా, సత్యశ్రీ, సాయి సాన్విద్, చరణ్ తేజ్, షేక్ రసూల్, హర్ష, పార్వతి దాసరి, కీర్తన శ్రీనివాస్, కళ్యాణి చింతా, అర్జున్ విజయ్, వినోద్ శర్మ మొదలైన యువ గాయనీ, గాయకులు వైల్డ్ కార్డ్ ద్వారా షోలో చోటు దక్కించుకొనేందుకు పోటీ పడుతున్నారు. 

 

Saregamapa Singers (12 Contestants for Wildcard Entry)

ఈ నెల 16 నుండి 22 తేది వరకు ప్రేక్షకులు తమ అభిమాన సింగర్స్‌ని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయవచ్చు. అలా ఎంపికైన వారికి, మళ్లీ షోలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. 

srmptelugu.zee5.com/wildcard అనే లింక్ ద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన సింగర్‌కు ఓటు వేయవచ్చు. ఇలా ఓటింగ్ ద్వారా గెలిచే గాయనీ, గాయకులు వైల్డ్ కార్డు ద్వారా మరల షోలో పాల్గొంటారు. 

కనుక, ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ అభిమాన సింగర్‌కు ఓటు వేసేయండి. ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే, సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ షో ఆహుతులను అమితంగా అలరిస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!