జీ తెలుగు ప్రీమియర్ లీగ్ (Zee Telugu Premier League): టీవీ స్టార్స్‌తో.. క్రికెట్ సమరం

Updated on May 13, 2022 09:09 PM IST
Zee Telugu Premier League Poster
Zee Telugu Premier League Poster

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌గా వెలుగొందుతున్న జీ తెలుగు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్‌తో మన ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో జీ తెలుగు ప్రీమియర్ లీగ్ పేరిట ఈ ఛానల్ ఓ క్రికెట్ ట్రోఫీని కూడా నిర్వహించడానికి సిద్ధమైంది. 

ఈ లీగ్‌లో నాలుగు టీమ్స్ పాల్గొంటున్నాయి. ఫిక్షన్‌తో పాటు నాన్ ఫిక్షన్ షోస్‌లో నటిస్తున్న స్టార్స్ కూడా ఈ లీగ్‌లో ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. ఇదే క్రమంలో  బాహా బాహీ పోరుకి సిద్ధమవుతున్నారు. దాదాపు 100 మంది పాపులర్ ఆర్టిస్టులను ఈ లీగ్ ద్వారా వీక్షించే సదవకాశం తెలుగు ప్రేక్షకులకు లభించనుంది. 

15 మే, 2022 తేదిన మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ లీగ్ ప్రారంభమవుతుందని ఛానల్ ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. సినీ నటుడు ప్రిన్స్ తన కొత్త సినిమా "పెళ్లికూతురు పార్టీ"ను ప్రమోట్ చేయడానికి ఈ లీగ్‌కు విచ్చేస్తున్నారు.

అలాగే ఓ స్పెషల్ పెర్ఫార్మెన్స్‌ను కూడా అందివ్వనున్నారు. అలాగే మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, యాంకర్ నేహ ఈ లీగ్‌కు కామెంటేటర్లుగా వ్యవహరించగా, కమెడియన్ రచ్చ రవి తనదైన శైలిలో అంపైరింగ్ చేయనున్నాడు. 

లీగ్‌లో పాల్గొనే టీమ్స్ వివరాలు: శ్రీరామ్ (నాటు వారియర్స్), కల్కి రాజ్ (తగ్గేదెలే టైగర్స్), ఆకుల బాలాజీ (డార్లింగ్ డెవిల్స్), రాజీవ్ (స్టైలిష్ సింగమ్స్)
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!