జీ మహోత్సవంలో దుమ్ము రేపడానికి సిద్ధమవుతున్న.. F 3 తారలు !

Updated on May 21, 2022 10:37 PM IST
జీ మహోత్సవంలో ఎఫ్ 3 టీమ్ సందడే సందడి
జీ మహోత్సవంలో ఎఫ్ 3 టీమ్ సందడే సందడి

జీ తెలుగు (Zee Telugu).. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఒరవడిని ఏర్పాటు చేసుకున్న టీవీ ఛానల్. 2005 లో ప్రారంభమైన ఈ ఛానల్ కేవలం సీరియల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలకు సైతం రూపకల్పన చేస్తోంది.

ఈ ఏడాదితో 17 వ పడిలోకి అడుగుపెడుతున్న ఈ ఛానల్, తమ ప్రేక్షకుల కోసం ఓ ప్రత్యేకమైన వేడుకను డిజైన్ చేసింది. జీ మహోత్సవం పేరుతో అలరించబోతున్న ఈ వేడుక 22 మే 2022 తేదిన సాయంత్రం 6 గంటల నుండి జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. 

ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించగా, F 3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఆ చిత్రంలో నటించిన తారలు కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగా కనువిందు చేయనున్నారు. తమ హాస్య ఛలోక్తులతో అలరించనున్నారు. దగ్గుబాటి వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, సోనాల్, సునీల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి.. జీ తెలుగు కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి సిద్ధమవుతున్నారు. 

 

ఇదే కార్యక్రమంలో సరిగమప సింగర్ శివ పార్వతి కోసం స్పెషల్ ట్రిబ్యూట్‌ను అందిస్తూ, మరోవైపు సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ కోసం పోటీ పడుతున్న కంటెస్టంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక గీతాలాపన కూడా ప్రేక్షకులకు స్పెషల్ ఎట్రాక్షనే అనుకోవాలి. 

ఇవే కాకుండా పలు డ్యాన్స్, మ్యూజిక్ ప్రదర్శనలు, ఫన్నీ గేమ్స్ మొదలైనవి.. జీ తెలుగు ప్రేక్షకుల కోసం.. జీ మహోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా రూపకల్పన చేయడం విశేషం. 

జీ మహోత్సవం వేడుకల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడుర్ కొన్ని విషయాలను పంచుకున్నారు. "ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రజలకు వినోదాన్ని వైవిధ్యమైన రీతిలో పంచడానికి జీ తెలుగు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మేము తెలుగు ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను రూపకల్పన చేస్తూనే ఉన్నాం.

ఇదే క్రమంలో వారి ప్రేమాభిమానాలను పొందాం. వారి సహకారాన్ని మేము మరువలేము. వారి కోసమే ఈ జీ మహోత్సవం. అపరిమితమైన నవ్వులతో, వినోదాన్ని అందించే అద్భుత ఉత్సవం ఈ జీ మహోత్సవం " అని ఆమె తెలిపారు. 

Advertisement
Credits: Zee Telugu (Twitter)

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!