నిత్యామీన‌న్ (Nitya Menen) : యూట్యూబ్ ఛానెల్ లాంఛ్ చేసిన హీరోయిన్

Updated on Apr 28, 2022 06:38 PM IST
నిత్యామీన‌న్ (Nitya Menen)
నిత్యామీన‌న్ (Nitya Menen)

టాలీవుడ్ లో అలా మొద‌లైంది సినిమాతో హీరోయిన్ గా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన న‌టి నిత్యామీన‌న్ (Nitya Menen). ఆ త‌ర్వాత ఇష్క్, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సెగ‌, 180, అ! వంటి హిట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌యింది. ఇటీవ‌ల‌ 'భీమ్లానాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించింది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు కూడా పోషించి మెప్పించింది. సింగ‌ర్ గానూ కొన్ని పాటలు పాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఆహా'లో ప్రసారమవుతోన్న ఇండియన్ ఐడల్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యామీనన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దానికి 'Nithya Unfiltered' అని పేరు పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఛాన‌ల్ కు దాదాపు 4వేల మందికి పైగా సోష‌ల్ మీడియా యూజ‌ర్లు సబ్ స్క్రైబ్ చేశారు. అయితే ఈ మ‌ధ్యకాలంలో కొంత మంది హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, టీవీ నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ త‌మ‌ అభిమానుల‌కు చేరువ‌కావ‌డానికి ప్ర‌య‌త్నించే సోష‌ల్ మీడియాను వాడుకుంటున్నారు. వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు బాగానే సక్సెస్ అవుతున్న‌ప్ప‌ట‌కీ.. మ‌రికొందరు అంత‌గా సక్సెస్ కాలేక‌పోతున్నారు.


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!