అమెజాన్(Amazon) తెర‌పై టాపులేపుతున్న సినిమాలు

Updated on Apr 26, 2022 04:35 PM IST
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో తెలుగు సినిమాలకు మంచి వ్యూయ‌ర్ షిప్ ఉంది. సినిమా హిట్టా ఫ‌ట్టా అనే దానితో ప‌నిలేకుండా ఓటీటీలో ఎక్కువ మంది మూవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో తెలుగు సినిమాలకు మంచి వ్యూయ‌ర్ షిప్ ఉంది. సినిమా హిట్టా ఫ‌ట్టా అనే దానితో ప‌నిలేకుండా ఓటీటీలో ఎక్కువ మంది మూవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో తెలుగు సినిమాలకు మంచి వ్యూయ‌ర్ షిప్ ఉంది. సినిమా హిట్టా ఫ‌ట్టా అనే దానితో ప‌నిలేకుండా ఓటీటీలో ఎక్కువ మంది మూవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అమెజాన్ ప్రైమ్ వీడియో తెర‌పై మెర‌వాల్సిందే. మూవీ రిలీజ్ అయిన కొద్ది వారాల్లోనే డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకుంటుంది అమెజాన్ సంస్థ‌. అస‌లు కొన్ని సినిమాలైతే డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్ తెర‌పై టాప్ ప్లేస్‌లోఉన్న తెలుగు సినిమాల వివ‌రాలు చూద్దాం. 

 


 

Radhe Shyam

1. రాధేశ్యామ్
అమెజాన్‌లో లేట్‌గా వ‌చ్చినా టాప్ ప్లేస్‌లో ప్లే అవుతున్న సినిమా రాధేశ్యామ్. ప్ర‌భాస్, పూజ‌హెగ్డేలు జంట‌గా న‌టించిన సినిమా ఈ మ‌ధ్యే ఓటీటీలో రిలీజ్ అయింది. రాధేశ్యామ్ సినిమాకు బ‌య‌ట‌ హిట్ టాక్ లేక‌పోయిన అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో దూసుకుపోతుంది 

Pushpa

2. పుష్ప‌
అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సినిమా. రిలీజ్ అయిన ద‌గ్గ‌ర‌నుంచి రికార్డులు కొల్ల‌గొడుతుంది. అమెజాన్‌లో మొన్న‌టి వ‌ర‌కు టాప్ ప్లేస్‌లో కొన‌సాగి ఇప్పుడు సెకెండ్ ప్లేస్‌కి వ‌చ్చింది. ఎన్ని సార్లు అయినా చూస్తూం.. త‌గ్గేదేలేదంటూన్నారు ఆడియ‌న్స్. 

Drishyam 2

3) దృశ్యం 2
డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజ్ అయిన సినిమా దృశ్యం 2.‘దృశ్యం’  సినిమాకి సీక్వెల్‌గా వ‌చ్చిన సినిమా. వెంక‌టేశ్, మీనా న‌టించిన సినిమా ఓటీటీ ఆడియ‌న్స్‌కు తెగ న‌చ్చింది. టాప్ 3లో ఈ సినిమా ప్లే అవుతుంది. 

Jai Bhim

4) జైభీమ్ 
సూర్య హీరోగా న‌టించిన బైభీమ్ త‌మిళ్ డ‌బింగ్ సినిమా. తెలుగులో డ‌బ్ అయి అమెజాన్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. 

Nani

5) టక్ జగదీష్ 
నాని హీరోగా న‌టించిన సినిమా ట‌క్ జ‌గ‌దీష్. కుటుంబ నేప‌ధ్యంలో తీసిన ఈ సినిమాకి ఓటీటీ ప్రేక్ష‌కులు టాప్ 5 ప్లేస్ ఇచ్చారు. 

Vakeel Saab

6) వకీల్ సాబ్ 
పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ కూడా టాప్‌5 లోనే కొన‌సాగుతుంది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాల‌కే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. 

Narappa

7) నారప్ప 
వెంక‌టేశ్ చేసిన డిఫెరెంట్ రోల్ సినిమా నార‌ప్ప‌. అసుర‌న్ సినిమా రీమేక్ చేసి తెలుగులో తీసిన సినిమా ఇది. ఓటీటీలో మంచి వ్యూయ‌ర్ షిప్‌ను తెచ్చుకుని టాప్ ప్లేస్ సాధించింది.

Aakasame Ne Haddura

8) ఆకాశం నీ హద్దురా 
సూర్య హీరోగా నటించిన సినిమా ఆకాశం నీ హ‌ద్దురా మొద‌ట‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది ఇప్పటికీ ఈ మూవీ టాప్ ప్లేస్ కొనసాగుతుంది.

Jathi Ratnalu

9) జాతి రత్నాలు
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో జాతిర‌త్నాలు తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌లోనూ, అమెజాన్ ప్రైమ్‌లోనూ హిట్ సినిమాగా నిలిచింది. 

 

Nishabdham

10) నిశ్శబ్దం 
నిశ్శబ్దం సినిమాలో అనూష్క ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఈ సినిమా  అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) అత్య‌ధిక వ్యూయ‌ర్ షిప్‌తో టాప్ 10 ప్లేస్‌లో ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!