Top 10 Superstars on TV: టీవీల్లో హీరోయిజం - ఇది యాక్టింగ్ కాదు యాంక‌రింగ్

Updated on May 01, 2022 06:11 PM IST
సినిమాల్లో హీరోలు డాన్స్, ఫైట్, యాక్ష‌న్ సీన్స్ చేస్తుంటారు. అభిమానులు వారు చేసే న‌ట‌న‌కు ఫిదా అవుతుంటారు. న‌ట‌న‌తో న‌వ్విస్తారు.. ఏడిపిస్తారు.. మురిపిస్తారు. డాన్సులు వేయిస్తారు. హీరోల‌తో యాక్టింగ్ కాకుండా యాంక‌రింగ్ చేయిస్తే ఎలా ఉంటుంది? ఎవ‌రికి వ‌చ్చిందో కానీ భ‌య్యా ఈ ఐడియా... అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ హీరోల‌ను టీవీ షోల్లో కూడా చూసుకుంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోలైతే వారు చేసే షో ల కోసం సినిమాల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారట‌. హీరోల టీవీ షోల వివ‌రాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..
సినిమాల్లో హీరోలు డాన్స్, ఫైట్, యాక్ష‌న్ సీన్స్ చేస్తుంటారు. అభిమానులు వారు చేసే న‌ట‌న‌కు ఫిదా అవుతుంటారు. న‌ట‌న‌తో న‌వ్విస్తారు.. ఏడిపిస్తారు.. మురిపిస్తారు. డాన్సులు వేయిస్తారు. హీరోల‌తో యాక్టింగ్ కాకుండా యాంక‌రింగ్ చేయిస్తే ఎలా ఉంటుంది? ఎవ‌రికి వ‌చ్చిందో కానీ భ‌య్యా ఈ ఐడియా... అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ హీరోల‌ను టీవీ షోల్లో కూడా చూసుకుంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోలైతే వారు చేసే షో ల కోసం సినిమాల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారట‌. హీరోల టీవీ షోల వివ‌రాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..

సినిమాల్లో హీరోలు డాన్సులు, ఫైట్లతో పాటు ఇతరత్రా యాక్ష‌న్ సీన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో అభిమానులు వారు చేసే న‌ట‌న‌కు ఫిదా అవుతుంటారు.  ఇక ఇదే నటనతో నవ్వించడం, ఏడిపించడం, మురిపించడం కూడా. కథానాయకులకు షరా మామూలే.  అయితే హీరోల‌తో యాక్టింగ్ కాకుండా, యాంక‌రింగ్ చేయిస్తే ఎలా ఉంటుంది? ఎవ‌రికి వ‌చ్చిందో కానీ భ‌య్యా ఈ ఐడియా... అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ హీరోల‌ను టీవీ షోల్లో కూడా చూసుకుంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోలైతే వారు చేసే షోల కోసం సినిమాల కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారట‌.  ఈ క్రమంలో మన  సూపర్ స్టార్ల టీవీ షోల వివ‌రాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..

చిరంజీవి (Chiranjeevi)

టీవీ షో: మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు (Meelo Evaru Koteeswarulu)

"రండి క‌ల‌ల‌ను గెలిపిద్దాం..  అందుకోసం ఆడేద్దాం.. మీలో ఎవరు కోటీశ్వరుడు" అంటూ బాస్ బుల్లితెరపై డైలాగులు చెబుతుంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. రాన‌నుకున్నావా.. రాలేన‌నుకున్నావా  అంటూ వ‌చ్చారు.. ఈ షో చేశారు.  నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బాస్ హోస్ట్ చేసిన నాలుగో సీజన్‌కు 3.62 రేటింగ్ దక్కింది.

నాగార్జున   (Nagarjuna)

టీవీ షోలు: మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు, Bigg Boss 3, 4, 5

వంద ప్ర‌శ్న‌ల‌కు ఒక్క జ‌వాబు ... అదే  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు అంటూ టీవీ స్క్రీన్ పై స‌వాల్ విసిరాడు మ‌న్మ‌ధుడు. ఆల‌స్యం లేకుండా షో మెద‌లెట్టాద్దామంటూ బిగ్ బాస్ షోను కూడా  అదరగొట్టారు. నాగార్జున టీవీ షోల‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.

అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్‌‌కు 8.20, మూడో సీజన్‌‌కు 6.72 రేటింగ్స్ దక్కాయి. బిగ్ బాస్ మూడు సీజ‌న్ల‌లో క్లాస్, మాస్ డైలాగుల‌తో నాగ్ తన అభిమానులకు ఆనందాన్నిచ్చారు. ఓటీటీలో వ‌చ్చే బిగ్ బాస్ 6 కి కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్నారు. 

 

బాలయ్యా బాబు  & రానా దగ్గుబాటి

నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balakrishna)

ఓటీటీ షో:   అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (Unstoppable)

నేను మీకు తెలుసు .. నా స్థానం మీ మ‌న‌సు .. అంటూ బాల‌య్య ఓటీటీ షో  ఒకటి చేశారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో వస్తున్న అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోలో బాల‌య్య నిజంగానే తన పంథాలో గ‌ర్జిస్తున్నారు. ద‌బ్బిడి దిబ్బిడేనంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. అప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్‌ చేసిన ఆహాకు దక్కని మంచి గుర్తింపు ఈ షోతో వ‌చ్చింది. ఆహానే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు, మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ చెరపడానికి బాలకృష్ణను హోస్ట్‌గా ఒప్పించారు. సబ్‌స్క్రైబర్స్ పెరిగినట్టు ఆహా తాజాగా వెల్లడించింది

రానా ద‌గ్గుబాటి (Rana Daggubati)

టీవీ, ఓటీటీ షో : నెం. 1 యారీ (Number 1 Yaari)

ఫ్రెండ్, దోస్త్.. యారీ అంటూ సెల‌బ్రెటీల స్నేహితుల‌ను ప‌రిచ‌యం చేసే షోకి హోస్ట్గా చేశారు రానా. నెం. 1 యారీ ప్రోగ్రామ్‌తో బుల్లితెర‌పై మెరిశారు. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీలో అలరిస్తున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ &  నాని

ఎన్టీఆర్ (Junior NTR)

టీవీ షోలు: బిగ్ బాస్ 1, ఎవరు మీలో కోటీశ్వరులు.

మారింది తెర సైజేనంటూ బుల్లితెర‌ ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌ర‌య్యారు ఎన్టీఆర్. "చూడ‌డానికి మీతో పాటు.. నేను ఎదురుచూస్తున్నా" అంటూ బిగ్ బాస్ 1 తోనే ఫేమ‌స్ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. రేటింగ్స్‌ను ప‌రుగులు పెట్టించారు. ఆ త‌రువాత సినిమాల్లో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాం చేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌కు ఇంకా ద‌గ్గ‌రై టీవీ షోల‌ రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు  కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. ఇప్పటి వరకూ ఇదే హయ్యెస్ట్ రేటింగ్.

నాని (Nani)

టీవీ షో : బిగ్ బాస్2

బాబాయి! ఈ సారి కొంచెం మ‌సాలా అంటూ  నాని బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్‌గా అల‌రించారు.  నా... నీ .. టీవీలోకి వెళిపోదాం అంటూ షోని ముందుకు తీసుకెళ్లారు. 

 సాయి కుమార్  &  ఆలీ

సాయికుమార్  (Sai Kumar)

టీవీ షో: వావ్ (Wow Show)

"వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో" అంటూ సాయికుమార్ వావ్ షోకి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌ద‌ల బోమ్మాలి.. వ‌ద‌ల అంటూ స‌ర‌దా గేమ్‌లతో అల‌రిస్తున్నారు. 

ఆలీ (Ali)

టీవీ షో: ఆలీతో సరదాగా (Ali Tho Sardaga)

"ఆలీతో స‌ర‌దాగా షో" పేరుతో వినోదాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు ఆలీ. సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో ఈ ప్రోగ్రామ్‌కి టాప్ రేటింగులు ఉన్నాయి. దాదాపు  250 ఎపిసోడ్‌లకు పైగా చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!