Top 4 Youtube Channels owned by TV Celebrities : యూట్యూబ్‌లోనూ వీరు స్టార్లే
చిన్న ఛానెల్ పెద్ద పేరు అంటే ఠక్కున చెప్పే పేరు యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఆర్టిస్టులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. చిన్నా, పెద్దా స్కీన్‌లతో పాటు యూట్యూబ్ ఛానల్‌తో వినోదం అందిస్తున్నారు. పర్స్‌నల్ లైఫ్‌తో పాటు ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
సమీరా షరీఫ్
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న స్టార్ సమీరా షరీఫ్. తన జీవితంలో జరిగే విశేషాలను వీడియోల్లో బంధించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తన డెలివరీ వీడియో కూడా సమీరా అఫ్‌లోడ్ చేశారు. టూర్స్, బర్త్‌డేలు ఎన్నో మోషనల్స్‌తో వీక్షకుల వినోదం అందిస్తున్నారు. ఆడపిల్ల సీరియల్‌తో సమీరా బుల్లితెరకు పరిచయమయింది. మొదటి సీరియల్‌తోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అన్నా చెల్లెల్లు, భార్యామణి, ముద్దు బిడ్డ లాంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగు, తమిళ్ సీరియల్స్‌లో దూసుకుపోయింది. తమిళ్ సీరియల్స్‌కు నిర్మాతగా కూడా.
వితికా శేరు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3తో హీరోయిన్ వితికా శేరు మరింత పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తర్వాత యూట్యూబ్ స్టాట్ చేశారు. తన రూం మొత్తం తానే డిజైన్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్నారు. క్రియేటివిటీగా ఆలోచనలతో వ్యూయర్స్‌ని ఆకర్షిస్తారు. వంటలు, డెకరేషన్, సెలబ్రేషన్స్‌తో చెలరేగిపోతున్నారు వితికా. ప్రస్తుతం యాంకర్‌గా బుల్లితెరపై మెరిసిపోతున్నారు. హీరో వరుణ్ సందేశ్ భార్యే వితికా శేరు.
హరితేజ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో హరితేజ ఫైనలిస్ట్. బిగ్‌బాస్ తను చెప్పిన హరికథలకు మంచి గుర్తింపు రావడంతో .. హరి.. కథలు అనే పేరుతో యూట్యూబ్ రన్ చేస్తున్నారు. తన జీవిత విశేషాలతో, చక్కనైన హరికథలతో అలరిస్తున్నారు హరితేజ.
సన
ఎన్నో సినిమాలు.. మరెన్నో సీరియల్స్‌లో బిజీగా ఉంటారు సన. అయినా కూడా ప్రేక్షకులకు మరింత వినోదం పంచాలని యూట్యూబ్ ఛానల్ పెట్టారు. నటనలో అనుభవాలు, తన కుటుంబం, యాక్టింగ్ స్టైల్, కొత్త వంటకాలతో సందడి చేస్తుంటారు. సన కోడలు సమీరా షరీఫ్, కూతురు తబుస్సుం కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున
సుమ కనకాల
ఎంటర్‌ట్రైన్ చేయడంలో ఎక్కడా తగ్గరు సుమ. ఏం చేసినా వెరైటీతో పాటు వినోదం అందించేలా ఉంటుంది. టీవీ షోస్, సినిమా ఈవెంట్లు ఇలా ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సుమ .. ఆవిడ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశారు. చిన్న పిల్లలను ఇంటర్వ్యూ చేస్తూ స్ట్రస్ లేకుండా చేస్తున్నారు. స్ట్రస్ బస్టర్ అనే పేరుతో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఫుడ్, బ్యూటీకి సంబంధించిన విశేషాలు చెప్పుంటారు.