Top 10 Telugu Best Short Films of 2021 : ఉత్త‌మ ల‌ఘు చిత్రాలు@2021

Updated on Apr 18, 2022 06:20 PM IST
త‌క్కువ టైంలో ఎక్కువ ఎంట‌ర్‌టైన్ చేసే లఘు చిత్రాల‌కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది.. సైన్స్ ఫ్రిక్ష‌న్, థ్రిల్ల‌ర్, ల‌వ్ , ఎమెష‌న్స్ .. ఇలా వెరైటీ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ కంపెనీ(ఐఎండీబీ) బెస్ట్ అంటూ 2021లో తీసిన ల‌ఘు చిత్రాల‌కు రేటింగ్ ఇచ్చింది. ఆ చిత్రాల వివ‌రాలేంటో తెలుసుకుందాం.
త‌క్కువ టైంలో ఎక్కువ ఎంట‌ర్‌టైన్ చేసే లఘు చిత్రాల‌కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది.. సైన్స్ ఫ్రిక్ష‌న్, థ్రిల్ల‌ర్, ల‌వ్ , ఎమెష‌న్స్ .. ఇలా వెరైటీ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ కంపెనీ(ఐఎండీబీ) బెస్ట్ అంటూ 2021లో తీసిన ల‌ఘు చిత్రాల‌కు రేటింగ్ ఇచ్చింది. ఆ చిత్రాల వివ‌రాలేంటో తెలుసుకుందాం.

త‌క్కువ టైంలో ఎక్కువ ఎంట‌ర్‌టైన్ చేసే లఘు చిత్రాల‌కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది.. సైన్స్ ఫ్రిక్ష‌న్, థ్రిల్ల‌ర్, ల‌వ్ , ఎమెష‌న్స్ .. ఇలా వెరైటీ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ కంపెనీ(ఐఎండీబీ) బెస్ట్ అంటూ 2021లో తీసిన ల‌ఘు చిత్రాల‌కు రేటింగ్ ఇచ్చింది. ఆ చిత్రాల వివ‌రాలేంటో తెలుసుకుందాం.

1. ది గాడ్ మ‌స్ట్ బి క్రేజీ

దేవుడు మ‌నుషుల‌ను భూమి మీద సంతోషంగా బ‌త‌క‌మ‌న్నాడు. కానీ దాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారంటూ సాగే షార్ట్ ఫిలిమ్.

ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ దేవుడు పాత్ర‌ను వెరైటీగా ప్ర‌జెంట్ చేశారు. ఈ లఘు చిత్రం 7.7 ఐఎండీబీ రేటింగ్ సాధించింది. ఇబ్ర‌హీం అల్లాస‌న్ అనే పాత్ర చూట్టూ తిరిగే క‌థాంశం. ఇత‌ను దేవుడు అనేక రూపాల్లో ఉంటాడ‌ని నిరూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. 

2. రుద్ర - ది రైట‌ర్

నాని బండేడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చ‌న మ‌రో ఉత్త‌మ ల‌ఘు చిత్రం రుద్ర‌.  సినిమా ర‌చ‌యితల‌ పోరాటంపై తీసిన సినిమా. ఈ సినిమాకు 8.0 ఐఎండీబీ రేటింగ్ వ‌చ్చింది. సినీ ర‌చ‌యిత‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయ‌ల‌పై తీసిన‌ ల‌ఘు చిత్రం. ఈ చిత్రంలో అనిరుధ్ తోటపల్లి, అశోక్ సిరియాల, శ్రీమాన్ కీర్తి, కిరిటీలు న‌టించారు. 

3. ఏడు

థ్రిల్లర్ సినిమా ఏడు. ప్ర‌తి రోజు ఉద‌యం ఏడు గంట‌లకు నిద్ర లేచే ఓ వ్య‌క్తికి ఎదుర‌య్యే వింత ప‌రిస్థుల‌పై తీసిన ల‌ఘు చిత్రం. నాని ప్ర‌మోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 8.1 ఐఎండీబీ రేటింగ్  పొందింది. టైం లూప్ లో ఎలా ఇరుక్కుపోయిన వ్య‌క్తిపై సాగే చిత్రం. 

4. వర

సైన్స్ ఫిక్షన్ ఇష్ట‌ప‌డే వారికి ఈ ల‌ఘు చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వ‌ర సినిమా ఉద్వేగ భ‌రిత స‌న్నివేశాల‌తో సాగుతుంది. 

విద్యాధ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌ర ల‌ఘు చిత్రం 8.8 ఐఎండీబీ రేటింగ్ సాధించింది. ఓ వ్యాధితో భాద‌ప‌డుతున్న వ్య‌క్తి  విశ్వం ర‌హ‌స్యాల‌ను క‌నిపెడ‌తాడు. ఓ శిలాజాన్ని క‌నిపెడ‌తాడు. వెంకట్ రామకృష్ణ మేక, వెంకట్ వడిశెట్టి. వర్మవినోద్ నటించారు. 

5. లివింగ్ ఐడియ‌ల్ ల‌ఘు చిత్రం

ర‌మ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లివింగ్ ఐడియ‌ల్ షార్ట్ ఫిలిం 9.0 ఐఎండీబీ రేటింగ్ పొందింది. భావోద్వేగాల మ‌ధ్య సాగే క‌థ‌. ఓ శిల్పి తాను చేసిన బొమ్మ‌కు రంగులు వేయ‌లేక‌పోతాడు. ఏ క‌ళ‌నైనా దుర్వినియోగం చేస్తే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌ని త‌లిపే క‌థాంశం. ఉత్త‌మ తెలుగు చిత్రాల్లో ఈ ల‌ఘు చిత్రం ఒక‌టి. 

6. ఎ డ్రైవ‌ర్ స్టోరీ

క‌చ్చితంగా అంద‌రూ చూడ‌వ‌ల‌సిని ల‌ఘు చిత్రం ఇది. ఎ డ్రైవ‌ర్ స్టోరీ 9,0 ఐఎండీబీ రేటింగ్ సాధించిన మ‌రో ఉత్త‌మ చిత్రం. పోలీసులు ఓ డాన్‌ను ప‌ట్టుకునేందుకు ర‌హ‌స్య ఆప‌రేష‌న్ చేస్తారు. అయితే అత‌ని కారు డ్రైవ‌ర్  ఇబ్బందుల్లో ప‌డ‌తాడు. కామెడీతో సాగే ల‌ఘు చిత్రం. ఒకే గ‌దిలో ఈ చిత్రం తీవారు. ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను ఆశ్య‌ర్య ప‌రిచాయి. 

7. 15 డేస్ ఆఫ్ లవ్

ఉత్త‌మ లఘు చిత్రాల్లో ఒక‌టి 15 డేస్ ఆఫ్ లవ్. జ‌య కిషోర్ బండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ప్రేమ కోసం యువ జంట చేసే ప్ర‌య‌త్నాల‌ను చూపిస్తూ తీశారు. ప్రేమికుల మ‌ధ్య అవ‌గాహ‌న.. వారి జీవితం ఆనంద‌మ‌యం చేస్తుంది. అద్భుతంగా సాగే ఈ క‌థ బెస్ట్ షార్ట్ పిలింగా నిలిచింది. 

8. ఎమోష‌న్

ప్రేమ నేప‌థ్యంలో వ‌చ్చిన ల‌ఘు  చిత్రాల్లో ఎమోష‌న్ ఒక‌టి. ప్రేమ‌లో కోల్పోయిన క్ష‌ణాల‌ను తిరిగి పొందాల‌నేది ఈ చిత్ర క‌థ‌. ఈ ల‌ఘు చిత్రానికి స‌మ్రాన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ‌చంద్ర‌, మేఘ‌నా లోకేష్‌లు నటించారు. ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనుబంధాల గురించి ద‌ర్శ‌కుడు విలువైన మెసేజ్ ఇచ్చారు. 

9. కృష్ణమూర్తి గారింట్లో

ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ల‌ఘు చిత్రం కృష్ణ‌మూర్తి గారింట్లో. లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం కైమాక్స్ అదిరింది. ఓ యువ‌కుడు తండ్రి బ‌ల‌వంతంపై అత‌ని స్నేహితుడు కృష్ణ‌మూర్తి గ్రామానికి వెళ‌తాడు. కృష్ణ‌మూర్తి కూతురితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. చివ‌రికి వీరి ప్రేమ క‌థ ఏమంతుంద‌నేది చిత్ర క‌థ‌. ప్ర‌తి ఒక్క‌రిని గంద‌ర‌గోళంలో ప‌డేసే క్లైమాక్స్  ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. 

10. వై నాట్ ఎ గ‌ర్ల్?

అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లలో ఒక‌టైన ఈ ల‌ఘు చిత్రానికి సునీల్ పుఫ్పాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆడ‌పిల్ల పుట్ట‌కూడ‌దని కోరుకునే కుసంస్కారుల‌పై తీసిన చిత్రం. ఓ మంచి సందేశ‌త్మ‌క చిత్రంగా పేరు తెచ్చుకున్న ల‌ఘు చిత్రం. 21 శ‌తాబ్దంలోనూ కొంద‌రి మ‌నుషులు ఆలోచ‌న‌లు, న‌మ్మ‌కాలు ఎలా ఉన్నాయో స‌మాజానికి తెలిసేలా తీశారు. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!