Top 10 Multi talented TV Celebrities : అర‌వై నాలుగు "క‌ళ‌ల" ఆర్టిస్టులు

Updated on Apr 14, 2022 11:50 PM IST
ఒక‌టి కాదు.. వంద ర‌కాలుగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధం అంటున్నారు ఈ బుల్లి తెర స్టార్స్
ఒక‌టి కాదు.. వంద ర‌కాలుగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధం అంటున్నారు ఈ బుల్లి తెర స్టార్స్

ఒక‌టి కాదు.. వంద ర‌కాలుగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధం అంటున్నారు ఈ బుల్లి తెర తారలు. కామెడీ పంచుల‌తో అద‌ర‌గొడ‌తారు. డాన్స్‌ల‌తో దుమ్ములేపుతారు. స్కిట్ల‌తో చెల‌రేగిపోతారు. తెర చిన్న‌దా.. పెద్ద‌దా అని చూడ‌రు. క్యారెక్ట‌ర్‌లో లీన‌మైపోతారు. పాట‌లతో మాయ‌ చేస్తామంటారు. అప్పుడప్పుడు మ్యాజిక్ కూడా చేసేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వెరైటీ వినోదాల‌ను అందిస్తామంటున్న‌ ఈ స్మాల్ స్క్రీన్ స్టార్స్ గురించిన స్టోరీ మీ కోసం ప్రత్యేకం.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

పేరుకు త‌గిన‌ట్టుగానే సుడిగాలిలా చెల‌రేగిపోతున్నాడు సుధీర్. బుల్లితెర‌పై రోజు రోజుకు ఇమేజ్ పెంచుకుంటున్న స్టార్. క‌మెడియ‌న్గా జ‌బ‌ర్ధ‌స్త్ షోలో ఎంట్రీ ఇచ్చి త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ (అల్టిమేట్ డాన్స్) షోలతో దుమ్మురేపాడు. క‌మెడియన్‌గానే కాకుండా, మెజీషియ‌న్, సింగ‌ర్‌గా కూడా త‌న టాలెంట్ చూపిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరో కూడా అయ్యాడు.సినిమాల‌తో పాటు అన్నిర‌కాల షోల‌తో అల‌రిస్తున్నాడు సుడిగాలి సుధీర్. 

రామ్ చరణ్‌తో సుడిగాలి సుధీర్

హ‌రితేజ‌ (Hari Teja)

బిగ్‌బాస్‌ షోలో తన హ‌రిక‌థ‌ల‌తో అల‌రించారు హ‌రితేజ‌.  ఈమె కూచిపూడి డాన్స‌ర్ కూడా. సీరియ‌ల్స్, సినిమాల్లో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాంక‌రింగ్ చేసి ఆడియ‌న్సుకు ద‌గ్గ‌ర‌య్యారు. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో హ‌రితేజ నంబ‌ర్ వ‌న్ లేడీ స్టార్.

అక్కినేని అఖిల్‌‌తో హరితేజ

ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju)

ప్ర‌దీప్ టీవీ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.రేడియో జాకీగా కూడా ప్ర‌దీప్ ఉల్లాసాన్ని పంచారు. పెళ్లిచూపులు షోతో ఈయనకు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. సినిమాల్లోనూ హీరోల ఫ్రెండ్ పాత్ర‌ల‌తో రాణించి.. ఆ తర్వాత న‌టుడుగానూ ఫ్రూవ్  చేసుకున్నాడు. యాంక‌ర్ ప్ర‌దీప్ 'వ‌న్'.. ఎంతో ఫన్ ఉండే షో అంటారు ఆడియ‌న్స్ . 

ప్రదీప్ మాచిరాజు

సుమ క‌న‌కాల‌ (Suma Kanakala)

అన్ని క‌ళ‌లు తెలిసిన సూప‌ర్ యాంక‌ర్ సుమ‌. వినోదం అంటే సుమ‌.. సుమ అంటే వినోదం. అందుకే వేల ఎపిసోడ్లు పూర్తి చేసిన వ్యాఖ్యాత‌గా  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ప‌లు సీరియ‌ల్స్, సినిమాల్లోనూ న‌టించింది.  కొత్త సినిమాల ప్రిరిలీజ్ వేడుకలకు యాంకరింగ్ చేయ‌డంలో సుమ‌కు మించిన వారు లేరు.

సుమ కనకాలకు మూగ జీవాలంటే ఎంత ఇష్టమో

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

అనసూయ భరధ్వాజ్ యాంక‌ర్‌గా త‌న కెరీర్ స్టాట్ చేశారు. ఆ త‌ర్వాత‌ బుల్లితెర‌, వెండితెరపై పాపుల‌ర్ అయ్యారు. రంగ‌మ‌్మత్త వంటి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ప్ర‌స్తుతం సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా మారారు.

అల్లు అర్జున్‌తో అనసూయ భరద్వాజ్

హైప‌ర్ ఆది (Hyper Aadi)

హైప‌ర్ ఆది కడుపుబ్బా నవ్వించే సత్తా ఉన్నా కమెడియన్. జబర్దస్త్  షోలో ఆది పంచులు మాములుగా పేల‌వు. ఈయన అస‌లు పేరు కోట ఆద‌య్య.  స్కిట్స్ ద్వారానే పాపుల‌ర్ అయ్యాడు. సినిమాల్లోనూ న‌టించి న‌వ్వించాడు. హైప‌ర్ ఆది స్క్రిప్ట్‌ రైట‌ర్‌గా కూడా త‌నను తాను నిరూపించుకున్నాడు.

సినీ నటి రోజాతో హైపర్ ఆది

శివారెడ్డి (Shiva Reddy)

మిమిక్రీతో పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వించే క‌మెడియ‌న్ శివారెడ్డి. మిమిక్రీ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీతో పాటు దేశ విదేశాల్లో మిమిక్రీ షోలు చేశాడు. సినీ, రాజ‌కీయ ప్రముఖుల‌ను అనుకరిస్తూ శివారెడ్డి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల్లోనూ గుర్తుండిపోయే కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించాడు.

ఇస్మార్ట్ జోడీ సెట్‌లో మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి

అదిరే అభి (Adhire Abhi)

జబర్దస్త్ షోలో అదిరేటి పంచులతో అభిన‌య కృష్ణ‌ ప్రేక్ష‌కుల‌కు కామెడీ పంచుతున్నాడు. కామెడీ షోలు చేస్తున్న అదిరే అభి యాంక‌ర్, డాన్స‌ర్, స్టాండ్-అప్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. చాలా సినిమాల్లో న‌టించాడు. అక్కినేని నాగార్జున సారథ్యం వహించిన  "మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

మెగాస్టార్ చిరంజీవి గెటప్‌లో.. స్కిట్‌లో అదరగొడుతున్న అదిరే అభి

ఇమ్మాన్యుల్ (Emmanuel)

జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్ల‌తో మంచి పేరు  తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుల్. ముక్కు అవినాష్ టీమ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . అవినాష్  బిగ్‌బాస్‌లోకి  వెళ్లాక కెవ్వు కార్తీక్ టీమ్‌లోకి వెళ్లాడు. వ‌రుస స్కిట్లతో.. స్పాంటేనియ‌స్ బావుందంటూ జ‌డ్జీల మెప్పును పొందాడు. అంతేకాదు వ‌ర్ష‌తో వేసే స్టేప్పులు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. పాట‌ల‌తో కూడా ఇమ్మాన్యుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. 

ఇమ్మాన్యుల్.. ఇతడి రూటే సెపరేటు

రష్మి గౌతమ్ (Rashmi Gautham)

వెండితెరతో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మీ బుల్లితెర‌పై క్రేజీ యాంకర్‌గా స్థి ప‌డిపోయింది. జ‌బ‌ర్ధ‌స్ షోతో కుర్ర‌కారును హుషారెత్తించింది. ప‌లు సినిమాలలో న‌టించింది.  ఓ సీరియ‌ల్ కూడా చేసింది. సినిమాలో స‌హాయ‌న‌టిగా కూడా యాక్ట్ చేసింది. రియాలిటీ డాన్స్ షోలో డాన్స‌ర్‌గా చేసింది. 

"బొమ్మ బ్లాక్ బస్టర్" సినిమా సెట్స్‌లో.. ఓ వైవిధ్యమైన గెటప్‌లో రేష్మి గౌతమ్

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!